Haryana: పొగ మంచు ప్రభావంతో కనిపించని రోడ్డు.. హైవేపై 15 వాహనాలు ఢీ.. పలువురికి గాయాలు

ఆదివారం ఉదయం పొగ మంచు కారణంగా హైవేపై రోడ్డు సరిగ్గా కనిపించలేదు. దీంతో వెనుక నుంచి వచ్చిన వాహనం ముందుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొంది. దీంతో ఆ వాహనాలు అక్కడే ఆగిపోయాయి.

Haryana: పొగ మంచు ప్రభావంతో కనిపించని రోడ్డు.. హైవేపై 15 వాహనాలు ఢీ.. పలువురికి గాయాలు

Updated On : December 18, 2022 / 8:34 PM IST

Haryana: పొగ మంచు ప్రభావంతో హరియాణాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో ఏకంగా 15 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన అంబాలా-యమునా నగర్-సహరణ్ పూర్ హైవేపై జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని హరియాణా ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

Maharashtra: బాలికపై పన్నెండు గంటలపాటు సామూహిక అత్యాచారం.. 8 మంది నిందితులు అరెస్ట్

వాళ్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం పొగ మంచు కారణంగా హైవేపై రోడ్డు సరిగ్గా కనిపించలేదు. దీంతో వెనుక నుంచి వచ్చిన వాహనం ముందుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొంది. దీంతో ఆ వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఈ వాహనాలు కూడా సరిగ్గా కనిపించకపోవడంతో వెనకాల వచ్చిన మిగతా వాహనాలు వీటిని ఢీకొన్నాయి. అలా రోడ్డుపై అనేక వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో రోడ్డు బ్లాకైంది. ప్రమాదాన్ని గుర్తించిన కొందరు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు, ఇతర సిబ్బంది కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనాల్లో చిక్కుకుని, ప్రమాదానికి గురైన వారిని బయటకు తీశారు. స్థానిక ఆస్పత్రులకు తరలించారు. క్రేన్లు తెప్పించి, వాహనాలను తొలగించారు.

Lucknow University: లక్నో యూనివర్సిటీలో వింత నిబంధన.. పది దాటితే క్యాంపస్‌లో తిరగొద్దట!

ఈలోగా ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల్ని దారి మళ్లించారు. మొత్తంగా 15 వాహనాల వరకు ఢీకొన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో వాహనదారులు గాయపడగా, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. వారికి చికిత్స కొనసాగుతోందన్నారు. కాగా, ఈ ప్రాంతంలో ఇటీవల వరుసగా విపరీతమైన పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.