అసోంలో లొంగిపోయిన 644 మంది తీవ్రవాదులు : పోలీస్‌ శాఖలో ఉపాధి

అసోంలో తీవ్రవాదంపై పోలీసులు భారీ విజయం సాధించారు. అసోంలో 8 మిలిటెంట్‌ గ్రూపులకు చెందిన 644 మంది తీవ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయారు.

  • Published By: veegamteam ,Published On : January 23, 2020 / 08:59 PM IST
అసోంలో లొంగిపోయిన 644 మంది తీవ్రవాదులు : పోలీస్‌ శాఖలో ఉపాధి

Updated On : January 23, 2020 / 8:59 PM IST

అసోంలో తీవ్రవాదంపై పోలీసులు భారీ విజయం సాధించారు. అసోంలో 8 మిలిటెంట్‌ గ్రూపులకు చెందిన 644 మంది తీవ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయారు.

అసోంలో తీవ్రవాదంపై పోలీసులు భారీ విజయం సాధించారు. అసోంలో 8 మిలిటెంట్‌ గ్రూపులకు చెందిన 644 మంది తీవ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఉల్ఫా, NDFB, RNLF, KLO, NSLA, ADF, NLFB, మావోయిస్టు గ్రూపులకు చెందిన తీవ్రవాదులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 

అసోం ముఖ్యమంత్రి శర్వానంద్‌ సోనోవాల్ సమక్షంలో వీరు లొంగిపోయారు. పెద్దఎత్తున తీవ్రవాదులు సరెండర్‌ కావడం పట్ల అసోం పోలీసులు సంతృప్తి వ్యక్తం చేశారు. లొంగిపోయినవారిని పోలీస్‌ శాఖలో ఉపాధి కల్పించనున్నట్లు అధికారులు చెప్పారు.

తీవ్రవాదులు 177 ఆయుధాలను పోలీసులకు సరెండర్‌ చేశారు. ఇందులో ఏకే-47, ఏకే-56 లాంటి అత్యాధునిక ఆయుధాలు కూడా ఉన్నాయి.