Viral Video: అరవై ఏడేళ్ల వయసులో రోప్ సైక్లింగ్.. ఈ బామ్మ టాలెంట్ చూస్తే వావ్ అనాల్సిందే!
కేరళకు చెందిన ఒక బామ్మ మాత్రం 67 ఏళ్ల వయసులో కూడా అదరగొడుతోంది. రోప్ సైక్లింగ్ చేస్తూ వావ్ అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఒక సోషల్ మీడియాలో షేర్ చేయగా, నెటిజన్ల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఆ బామ్మ టాలెంట్‌కు, ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Viral Video: అరవై ఏళ్లు వచ్చాయంటే చాలా మంది మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. అడుగుతీసి, అడుగు వేయాలంటేనే కష్టమైపోతుంది. అలాంటిది కేరళకు చెందిన ఒక బామ్మ మాత్రం 67 ఏళ్ల వయసులో కూడా అదరగొడుతోంది. రోప్ సైక్లింగ్ చేస్తూ వావ్ అనిపిస్తోంది.
Renu Desai: అనారోగ్యంపై సంచలన ప్రకటన చేసిన రేణూ దేశాయ్.. సోషల్ మీడియాలో వెల్లడించిన నటి
దీనికి సంబంధించిన వీడియోను ఒక సోషల్ మీడియాలో షేర్ చేయగా, నెటిజన్ల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఆ బామ్మ టాలెంట్‌కు, ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ బామ్మకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోయినప్పటికీ, వీడియో చూస్తే ఆమె కష్టం ఎలాంటిదో అర్థమవుతుంది. సాధారణంగా రోప్ సైక్లింగ్ చేయడం కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే చిన్న తాడుపై, చాలా ఎత్తులో సైకిల్ తొక్కాల్సి ఉంటుంది.
కిందికి చూస్తేనే కొందరికి కళ్లు తిరుగుతాయి. పైగా ఆ రోప్ తెగిందంటే కింద పడి గాయాలు కూడా కావొచ్చు. అంత ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ఆ బామ్మ మాత్రం ధైర్యంగా రోప్ సైక్లింగ్ చేస్తోంది. ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తున్న ఈ వీడియోను మీరూ చూడండి.
View this post on Instagram