Mangaluru Matsyagandha Exprees : రైలు ప్రమాదాన్ని తప్పించిన మహిళకు అధికారులు సన్మానం
ట్రాక్ పై వేగంగా దూసుకువస్తున్న రైలు పెను ప్రమాదానికి గురి కాకుండా తప్పించారు 70 ఏళ్ల మహిళ. తన ప్రాణాలకు తెగించి రైలు ప్రమాదాన్ని ఆపిన మహిళను అధికారులు ఘనంగా సన్మానించారు.

Mangaluru Matsyagandha Exprees..Woman saved
Mangaluru Matsyagandha Exprees : మంగళూరు నుంచి ముంబై వెళ్లే మత్స్యగంధ ఎక్స్‌ప్రెస్ ను ప్రమాదానికి గురి కాకుండా కాపాడిన మహిళను రైల్వే అధికారులు సన్మానించారు. చంద్రావతి అనే 70 ఏళ్ల మహిళ ఈదురుగాలులకు రైల్వే ట్రాక్ పై పడిన వృక్షాన్ని గుర్తించి రైలును ఆపి పెను ప్రమాదాన్ని తప్పింది. ట్రాక్ పై వేగంగా దూసుకువస్తున్న రైలును సదరు మహిళ ఆపిన తీరుపై రైల్వే అధికారులు నుంచి ప్రశంసలు దక్కాయి. పెను ప్రమాదాన్ని తప్పించిన ఆమెను సన్మానించటం తమ బాధ్యతగా భావించిన అధికారులు ఆమెను సన్మానించారు.
చంద్రావతి పాటిల్ అనే 70 ఏళ్ల మహిళ మంగళూరులో నివాసముంటోంది. వారి ఇల్లు రైల్వే ట్రాక్ సమీపంలోనే ఉంది. ఈక్రమంలో మార్చి 21 మధ్యాహ్నాం 2.10గంటల సమయంలో తన ఇంటిముందు కూర్చున్న చంద్రావతి పాటిల్ అనే 70 ఏళ్ల మహిళ ఈదురు గాలులకు ఓ భారీ వృక్షం రైల్వే ట్రాక్ పై కూలిన విషయాన్ని గమనించింది. అదే సమయంలో దూరం నుంచి ట్రాక్ పై రైలు దూసుకురావటం గమనించింది. రైలు అలాగే దూసుకొస్తే ప్రమాదానికి గురి అవుతుందని భావించింది. వెంటనే ఈ విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పి అప్రమత్తం చేయాలనుకుంది.కానీ అంత సమయంలేదు. కానీ అధికారులను అప్రమత్తం చేయటానికి ఇంటినుంచి పరుగు పరుగున వెళ్లటానికి బయలుదేరింది. ఆమె అధికారులను అప్రమత్తం చేయటం వారి చర్యలు తీసుకునేంత సమయం లేదు.రైతు దూసుకువచ్చేస్తోంది. దీంతో వెంటనే ఏదోవిధంగా రైలు ఆపటానికి యత్నించింది.
ప్రమాదానికి గుర్తు అయిన ఎరుపు రంగు బట్ట పట్టుకుని ట్రాక్ వైపు పరుగులు పెట్టింది. చేతిలోని ఎరుపు రంగు క్లాత్ గాలిలో ఊపుతూ ట్రాక్ వెంబడి పరిగెత్తింది..ఈక్రమంలో తనకు ఏమన్నా అవుతుందోమోనని ఏమాత్ర ఆలోచించలేదు. ఎరుపు రంగు క్లాత్ చూపిస్తు పరుగెత్తింది. దూరంగా నుంచే ఎరుపురంగా క్లాత్ తో ఓ మహిళ పరుగులు పెట్టటాన్ని మత్స్యగంధ ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ గుర్తించి వెంటనే అప్రమత్తమై రైలు బ్రేక్ లు వేయడంతో రైలు వేగం తగ్గి, చెట్టు కూలిన చోటుకు దగ్గర్లో ఆగిపోయింది.
ట్రాక్ పై కూలిన చెట్టును గమనించిన లోకో పైలట్.. పెద్ద ప్రమాదం తప్పిందని..ఆమెకనుక అప్రమత్తం చేయకపోతే ఏం జరిగేదో అని ఊహించానికి భయపడి ప్రమాదం తప్పించిన ఆమెను అభినందించి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని లోకో పైలెట్ ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో ఎంతోమంది ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిన చంద్రావతిని మంగళవారం (ఏప్రిల్4,2023) అధికారులు ప్రశంసించి ఘనంగా సన్మానించారు.