Snake: నీ గట్స్‌కి హ్యాట్సాఫ్ బామ్మ.. 8 అడుగుల పాముని చేత్తో పట్టుకుని మెడలో వేసుకున్న 70 ఏళ్ల వృద్ధురాలు..

బామ్మ చేసిన పనికి గ్రామస్తులు షాక్ అయ్యారు. ఎంతో ఈజీగా ఎలాంటి భయం లేకుండా అంత పెద్ద పామును ఆమె పట్టుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

Snake: నీ గట్స్‌కి హ్యాట్సాఫ్ బామ్మ.. 8 అడుగుల పాముని చేత్తో పట్టుకుని మెడలో వేసుకున్న 70 ఏళ్ల వృద్ధురాలు..

Updated On : July 29, 2025 / 1:10 AM IST

Snake: పాముని దూరం నుంచి చూస్తేనే ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. భయంతో కాళ్లు చేతులు వణుకుతాయి. పాము కనిపించగానే ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తాము. అలాంటిది 8 అడుగుల పాము.. మన పక్కనే కనిపిస్తే.. వామ్మో ఇంకేమైనా ఉందా.. ప్రాణాలు పోయినంత పని అవుతుంది అని అంటారు కదూ. మన సంగతి పక్కన పెడితే.. 70 ఏళ్ల బామ్మ చూపిన ధైర్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వృద్ధురాలు 8 అడుగుల పాముని చేత్తో పట్టుకుంది. అంతేకాదు మెడలో వేసుకుని ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

పుణె సమీపంలోని ముల్షీ తాలుకా కసర్ అంబోలీ గ్రామంలో ఇంటి పరసరాల్లోకి పాము వచ్చింది. అది చాలా పెద్దగా ఉంది. పాముని చూసిన గ్రామస్తులు భయంతో కేకలు వేశారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంతలో శకుంతల సుతర్ అనే వృద్ధురాలు అక్కడికి వచ్చింది. ఆమె వయసు 70ఏళ్లు. పాముని చూసి అంతా భయంతో పరుగులు పెడుతుంటే.. ఆమె ఎంతో ధైర్యం ముందుకొచ్చి పాముని తన చేతులతో పట్టుకుంది. ఎంతో చాకచక్యంగా భారీ పామును ఒట్టి చేతులతోనే పట్టేసుకుంది. అంతేకాదు.. దాన్ని మెడలో వేసుకుని ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చిందా బామ్మ.

బామ్మ చేసిన పనికి గ్రామస్తులు షాక్ అయ్యారు. ఎంతో ఈజీగా ఎలాంటి భయం లేకుండా అంత పెద్ద పామును ఆమె పట్టుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే, ఆ పాము విషపూరితమైనది కాదని, భయపడాల్సిన అవసరం లేదని బామ్మ చెప్పింది. ఆ పాము విషపూరితమైనది కాదని, అందుకే తాను భయం లేకుండా దాన్ని పట్టుకోగలిగానని ఆమె వివరించింది. అన్ని పాములు ప్రమాదకరం కాదు అని చెప్పడానికే, ప్రజల్లో అవగాహన కల్పించడానికే తాను ఇలా చేశానని ఆమె వెల్లడించింది.

8 అడుగుల పాముని 70 ఏళ్ల వృద్ధురాలు చేత్తో పట్టుకుని మెడలో వేసుకోవడాన్ని అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్ లో వీడియోలు తీశారు. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంత పెద్ద పాముతో వృద్ధురాలు నిర్భయంగా వ్యవహరించడం చూసి చాలా మంది అవాక్కయ్యారు. ఆ బామ్మ ధైర్య సాహసాలకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఎలుక పాములు అంత హానికరం కాదని బామ్మ చెప్పింది. అంతేకాదు అవి ప్రకృతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరింది.

”పామును చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి పాము విషపూరితం కాదు. ఎలుక పాము మానవులకు హాని చేయదు. నిజానికి ఇది ఎలుకలు , తెగుళ్ళను తింటుంది. పొలాలకు ఉపయోగపడుతుంది. ప్రజలు భయం, మూఢనమ్మకాలతో తరచుగా పాములను చంపుతారు, ఇది తప్పు” అని బామ్మ వివరించింది.