Karnataka Old Woman : చిన్న షెడ్డులో నివాసముంటున్న 90 ఏళ్ల వృద్ధురాలికి.. ఏకంగా రూ. లక్ష కరెంట్ బిల్లు

సిబ్బంది, బిల్లు కలెక్టర్ పొరపాట్ల కారణంగా భారీగా కరెంటు బిల్లు వచ్చిందని గుర్తించారు. ఈ బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు వృద్ధురాలికి భరోసా ఇచ్చారు.

Karnataka Old Woman : చిన్న షెడ్డులో నివాసముంటున్న 90 ఏళ్ల వృద్ధురాలికి.. ఏకంగా రూ. లక్ష కరెంట్ బిల్లు

karnataka woman

Updated On : June 23, 2023 / 11:28 AM IST

Huge Electricity Bill : కర్నాటక కొప్పల్ లోని భాగ్యనగర్ లో ఓ చిన్న షెడ్డులో తలదాచుకుంటున్న గిరిజమ్మ అనే మహిళకు ఏకంగా రూ. లక్ష కరెంట్ బిల్లు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఆమె విద్యుత్ ను వినియోగిస్తున్నందుకు నెలకు రూ. 70 నుంచి రూ. 80 వరకూ కరెంట్ బిల్లు వచ్చేది. బతికేందుకే ఇబ్బంది పడుతున్న వృద్ధురాలికి తాజాగా భారీ మొత్తంలో కరెంటు బిల్లు రావడంతో కలత చెందుతూ సాయం చేయాలని మీడియాను ఆశ్రయించారు.

ఈ ఘటనపై స్పందించిన మీడియా.. విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్ ను సంప్రదించగా మీటర్ లో లోపంతోనే కరెంటు బిల్లు తప్పుల తడకగా వచ్చిందని తెలిపారు. ఆమె అధిక బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మంత్రి సూచనతో గుల్బర్గా విద్యుత్ సరఫరా కంపెనీ (జెస్కం) గిరిజమ్మ షెడ్డును సందర్శించింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ విద్యుత్ మీటర్ ను తనిఖీ చేసి సాంకేతిక లోపం ఉన్నట్టు నిర్ధారించారు.

Mudragada Padmanabham : మీ బెదిరింపులకు భయపడి నేను లొంగిపోను.. పవన్ కళ్యాణ్ కు మరో లేఖ రాసిన ముద్రగడ

సిబ్బంది, బిల్లు కలెక్టర్ పొరపాట్ల కారణంగా భారీగా కరెంటు బిల్లు వచ్చిందని గుర్తించారు. ఈ బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు వృద్ధురాలికి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టారిఫ్ రేట్లను పెంచి అధిక విద్యుత్ బిల్లులతో ప్రజలపై భారం మోపుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.