93 ఏళ్ల తాత.. భార్యకి తాళిబొట్టు కొనివ్వాలనుకున్నాడు.. షోరూంలోకి వెళ్తే బిచ్చగాడు అనుకుని గెంటేశారు… కట్ చేస్తే..
ఈ షాపుకి వెళ్లడానికి ముందు ఆ వృద్ధ దంపతులు మరో బంగారం షాపుకి వెళ్లారు. కానీ అక్కడ ఉండే పనివాళ్లు తరిమేశారు.

తెల్ల ధోతి, కుర్తా, టోపీ ధరించి ఉన్న ఓ వృద్ధుడు (93) ఓ బంగారం దుకాణంలోకి తన భార్యతో వచ్చాడు. వారిని చూసిన షాపు సిబ్బందికి వారు అక్కడకు ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. ఏదైనా సాయం అడగడానికి ఆ వృద్ధ దంపతులు వచ్చారని అనుకున్నారు.
అయితే, ఆ వృద్ధుడు తన భార్యకు మాంగళసూత్రం కొనడానికి వచ్చానని షాపు సిబ్బందికి చెప్పాడు. ఆ వృద్ధుడు ఈ వయసులో తన భార్యపై చూపిస్తున్న ప్రేమకు ఆ షాపు యజమాని కరిగిపోయాడు. భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వృద్ధుడికి మంగళసూత్రానికి కేవలం 20 రూపాయలకే ఇచ్చాడు.
మనసును హత్తుకునే ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్‌లోని ఓ ఆభరణాల షాపులో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి రెండు కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వృద్ధుడు తన భార్యపై చూపించిన ప్రేమను చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.
ఆ వృద్ధుడి పేరు నివృత్తి షిండే, ఆయన తన భార్య పేరు శాంతబాయి. వారు జల్నా జిల్లాలోని అంబోరా జహాగీర్ గ్రామానికి చెందిన రైతులు. వారు ఆశాడి ఏకాదశి సందర్భంగా పండర్‌పూర్‌కు కాలినడకన పయనం చేస్తున్నారు. ఆ ప్రయాణం మధ్యలోనే ఛత్రపతి సంభాజీ నగర్‌లోని ఆభరణాల షాపులోకి వెళ్లారు.
వారిని చూసిన సిబ్బంది తొలుత వారు డబ్బు అడగడానికి వచ్చారని అనుకున్నారు. కానీ, ఆ వృద్ధుడు తన భార్యకు అతి తక్కువ డబ్బుతో మాంగళసూత్రం కొనాలనుందని చెప్పడంతో అక్కడి వారందరూ భావోద్వేగానికి లోనయ్యారు. షాపు యజమాని ఆయన ప్రేమను గమనించి, మాంగళసూత్రాన్ని బహుమతిగా ఇచ్చాడు.
“ఆ దంపతులు షాపులోకి వచ్చి రూ.1,120 ఇచ్చి మాంగళసూత్రం కావాలని చెప్పారు. ఇది చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. వారి నుంచి ఆశీర్వాదంగా 20 రూపాయలు తీసుకుని మాంగళసూత్రం అందజేశాను” అని షాపు యజమాని అన్నాడు.
కాగా, ఈ షాపుకి వెళ్లడానికి ముందు ఆ వృద్ధ దంపతులు మరో బంగారం షాపుకి వెళ్లారు. కానీ అక్కడ ఉండే పనివాళ్లు తరిమేశారు. చిత్రంగా ఆ షాపు కూడా ఈ ఓనర్ దే. ఓనర్ బయటి నుంచి వచ్చిన తర్వాత విషయం తెలిసింది. అతను మొదటి షాపు నుంచి రెండో షాపుకి వెళ్లేసరికి అక్కడ ఈ దంపతులు కనిపించారు. వృద్ధులకి అతను మంగళసూత్రం మాత్రం గోల్డ్ ది ఇచ్చాడు. చెయిన్ మామూలుదే.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ దంపతులు ఎప్పుడూ కలిసే తిరుగుతూ పరస్పరం సాయం చేసుకుంటూ బతుకుతున్నారు. వాళ్లకు ఓ కొడుకు ఉన్నా వీరిద్దరూ తమ మీదే తామే ఆధారపడుతూ జీవిస్తున్నారు.
View this post on Instagram