Auto Driver: ఐడియా అదుర్స్ కదూ..! పైసా పెట్టుబడి లేకుండానే నెలకు 8లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్.. ఎలానో తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

పెద్దగా చదువుకోలేదు. వ్యాపార నైపుణ్యమూ లేదు. టెక్నాలజీ మీద అవగాహనా లేదు.

Auto Driver: ఐడియా అదుర్స్ కదూ..! పైసా పెట్టుబడి లేకుండానే నెలకు 8లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్.. ఎలానో తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Updated On : June 7, 2025 / 7:35 PM IST

Auto Driver: అతడు ఓ ఆటో డ్రైవర్. పైసా పెట్టుబడి పెట్టింది లేదు. పెద్దగా శ్రమించిందీ లేదు. కనీసం చెమట చుక్క కార్చిందీ లేదు. ఇంకా చెప్పాలంటే ఆటో కూడా నడిపింది. కానీ లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. నెలకు కనీసం 5లక్షల నుంచి 8లక్షల వరకు ఆర్జిస్తున్నాడు. ఏంటి షాక్ అయ్యారా. కానీ, ఇది నిజం. ఆ ఆటో డ్రైవర్ ఏం చేస్తున్నాడు, లక్షలకు లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకోవాలని ఉంది కదూ. అతడు ఏం చేస్తే ఇంత డబ్బు వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే, అతడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ముంబైలోని ఒక ఆటో-రిక్షా డ్రైవర్ అసాధారణ బిజినెస్ ఐడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అతడి ఐడియా, సంపాదన అవాక్కయ్యేలా చేస్తున్నాయి. అతడి నెల సంపాదన ఐటీ డైరెక్టర్లు, సీఏల కన్నా ఎక్కువగా ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. నెలకు 5 లక్షల నుంచి 8 లక్షల వరకు సంపాదిస్తూ ఆ ఆటో డ్రైవర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అది కూడా ఆటో నడపకుండానే అతడీ మొత్తాన్ని ఆర్జిస్తున్నాడంటే నమ్ముతారా.

యుఎస్ కాన్సులేట్ వెలుపల తన వ్యూహాత్మక స్థానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, అతను నెలకు రూ. 5-8 లక్షలు సంపాదిస్తున్నాడని, ఐటీ డైరెక్టర్లు మరియు చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి అధిక సంపాదన కలిగిన నిపుణులను అధిగమించాడని తెలుస్తోంది, ఇవన్నీ కూడా తన ఆటో నడపకుండానే జరుగుతున్నాయి.

ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ చేస్తున్న వ్యాపారం ఏంటంటే.. జనాల లగేజీకి కాపలా కాయడమే. అతడి బిజినెస్ కి ఆధారమే యూఎస్‌ కాన్సులేట్. వీసా కోసం చాలమంది వ్యక్తులు కాన్సులేట్ కు వస్తుంటారు. అయితే వారి లగేజ్‌ని లోనికి అనుమతించారు. దీంతో సామాన్లను లోపలికి తీసుకెళ్లలేక బయట ఎక్కడ వదలాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సరిగ్గా.. ఈ ఇబ్బందిని ఆ ఆటో డ్రైవర్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఓ సూపర్ ఐడియా వేశాడు. అదేమిటంటే.. కాన్సులేట్‌కు వచ్చే వారి లగేజీ జాగ్రత్త చేయడం. వారు పని పూర్తి చేసుకుని వచ్చేంత వరకు వారి లగేజ్‌ని తన ఆటోలో సేఫ్‌గా ఉంచుతాడు‌. అందుకుగాను ఒక్కొక్కరి నుంచి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తాడు.

అయితే, చట్టపరంగా చిక్కులేవీ రాకుండా ఆ ఆటోవాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. స్థానికంగా లాకర్ సౌకర్యం ఉన్న ఓ పోలీసుతో అతడు పార్టనర్‌షిప్ ఏర్పాటు చేసుకున్నాడు. అలా లగేజ్ ని భద్రం చేసి లక్షలు గడిస్తున్నాడు. ఆ పోలీసు అధికారి అతడికి సురక్షితమైన నిల్వ స్థలాన్ని ఇస్తాడు. డ్రైవర్ లగేజీని సురక్షితంగా నిల్వ చేయడానికి వీలు కల్పిస్తాడు.

Also Read: 180 మీటర్ల దూరానికి ఓలా బైక్ బుక్ చేసుకున్న యువతి… ఎందుకని అడిగితే షాకింగ్ రీజన్..

లెన్స్‌కార్ట్‌ ప్రొడక్ట్ లీడర్ రాహుల్ రూపానీ తన లింక్డ్‌ ఇన్‌ పోస్ట్‌లో ఈ ఆటో డ్రైవర్ టాలెంట్ గురించి ప్రపంచానికి తెలియజేశారు. వీసా కోసం యూఎస్‌ కాన్సులేట్‌ కు వెళ్లిన సమయంలో తనకు ఈ డ్రైవర్‌ గురించి తెలిసిందన్నారు. తన లగేజీని సెక్యూరిటీ అనుమతించకపోవడంతో ఏం చేయాలో తోచక ఫుట్‌పాత్‌పై నిలబడి ఉంటే ఈ ఆటో డ్రైవర్‌ తన దగ్గరికి వచ్చాడని, మీ లగేజ్‌ ని నేను సురక్షితంగా ఉంచుతాను, అందుకు గాను వెయ్యి రూపాయలు చార్జ్ చేస్తాను అని చెప్పాడు. అలా అతడి వ్యాపారం గురించి తనకు తెలిసిందన్నారు.

”యూఎస్ కాన్సులేట్ కు వచ్చే వ్యక్తుల లగేజ్ స్టోరేజ్ సమస్యను ఆటోడ్రైవర్ గమనించాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పెయిడ్ బ్యాగ్ స్టోరేజ్ సర్వీస్ ను ప్రారంభించాడు. రోజుకు దాదాపు 20-30 మంది కస్టమర్లకు అతడు సేవలు అందిస్తాడు. అలా రోజుకు 20వేల నుంచి 30వేలు సంపాదిస్తాడు. అంటే ఉన్నత స్థాయి కార్పొరేట్ నిపుణులతో సమానమైన నెలవారీ ఆదాయం” అని రూపానీ తెలిపారు.

‘ఆ ఆటో డ్రైవర్ పెద్దగా చదువుకోలేదు. వ్యాపార నైపుణ్యమూ లేదు. టెక్నాలజీ మీద అవగాహనా లేదు. కేవలం నమ్మకమే పెట్టుబడిగా ఈ ఆదాయ మార్గాన్ని కనుగొన్నాడు. కస్టమర్ల లగేజీకి భద్రత కల్పించి కొంత మొత్తం వసూలు చేస్తూ వ్యాపారం చేస్తున్నాడు. అతడి వ్యాపార దక్షత అద్భుతం, అమోఘం” అంటూ తన పోస్ట్‌లో ఆ ఆటోవాలాపై ప్రశంసల వర్షం కురిపించారు రూపానీ.