Teacher Drink Alcohol : మద్యం సేవించి క్లాస్ రూమ్ లో నేలపై నిద్రించిన ఉపాధ్యాయుడు

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఫుల్ గా మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. మద్యం మత్తులో క్లాస్ రూమ్ లో నేలపైనే నిద్రపోయాడు. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఎంత లేపినా లేవలేదు.

Teacher Drink Alcohol : మద్యం సేవించి క్లాస్ రూమ్ లో నేలపై నిద్రించిన ఉపాధ్యాయుడు

TEACHER

Updated On : December 29, 2022 / 12:12 AM IST

Teacher Drink Alcohol : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఫుల్ గా మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. మద్యం మత్తులో క్లాస్ రూమ్ లో నేలపైనే నిద్రపోయాడు. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఎంత లేపినా లేవలేదు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటు చేసుకుంది. పేర్దూరు పరిధిలోని అలంగర్ ప్రభుత్వ పాఠశాలలో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం అతడు ఫుల్ గా మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. మద్యం మత్తులో తరగతి గదిలోని నేలపైనే పడుకున్నాడు. ఇది గమనించిన స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఉపాధ్యాయుడిని నిద్ర లేపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ఉపాధ్యాయుడు నిద్ర నుంచి లేవలేదు.

13 Girls Raped : 13 మంది విద్యార్ధినుల‌పై ఉపాధ్యాయుడు అత్యాచారం..జీవిత ఖైదు విధించిన కోర్టు

ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం స్థానికులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలకు తెలిసింది. తాగి రావడమే కాకుండా, మద్యం మత్తులో స్కూల్ లో పడుకున్న ఉపాధ్యాయుడు కృష్ణమూర్తిని సస్సెండ్ చేయాలని డిమాండ్ చేశారు.