Arvind Kejriwal: కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే – కేజ్రీవాల్
కాంగ్రెస్ కు ఓటేసినా పరోక్షంగా బీజేపీకి ఓటేసినట్లేనని అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు రూలింగ్ పార్టీలోకి జాయిన్ అయ్యే ట్రెండ్..

Arvind Kejriwal
Arvind Kejriwal: కాంగ్రెస్ కు ఓటేసినా పరోక్షంగా బీజేపీకి ఓటేసినట్లేనని అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు రూలింగ్ పార్టీలోకి జాయిన్ అయ్యే ట్రెండ్ కొనసాగుతుందని విమర్శించారు. గోవాలో ప్రస్తుతం AAP, BJPల మధ్యే యుద్ధం జరుగుతుందని ఆప్ పార్టీకి ఓటేసి బీజేపీని బయటకునెట్టేయాలని అంటున్నారు.
‘గోవాలో AAP, BJPలే ప్రజలకు చాయీస్. అంతా శుభ్రం చేసి నిజాయతీ గల గవర్నమెంట్ కావాలనుకుంటే AAPకు ఓటేయండి. అలా కాకుండా వేరే దేనికి ఓటేసినా బీజేపీకి ప్రత్యక్షంగానైనా లేదా పరోక్షంగానైనా ఓటేసినట్లే. కాంగ్రెస్ కు ఓటేసినా అదే పరిస్థితి’ అని కేజ్రీవాల్ అన్నారు.
2017 ఎన్నికలను రిఫరెన్స్ తీసుకుని ప్రస్తావించిన కేజ్రీవాల్.. 17మంది ఎమ్మెల్యేలతో గెలిచిన కాంగ్రెస్ లో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. చాలా మంది బీజేపీలో జాయిన్ అయి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారని అన్నారు.
Read Also: డోస్ పెంచేసిన బిగ్ బాస్ భామ లహరి!
బుధవారం 40మంది ఆప్ అభ్యర్థులు లీగల్ గా సంతకం పెట్టి.. నిజాయతీ గల ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ‘మా అభ్యర్థులంతా నిజాయతీగా ఉన్నారు. ఈ అఫిడవిట్ అనేది ఓటర్ల కోసమే’నని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
‘కొవిడ్ మహమ్మారి బాధితుల కోసం ఆప్ ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరించింది. అప్పుడేమైపోయాయి ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ’ అని ప్రశ్నించారు.