Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ వద్దంటూ చెట్టెక్కి కూర్చున్న యువకుడు

విలియనూరులో తనకు కరోనా వ్యాక్సిన్ వద్దని ఓ యువకుడు పారిపోయాడు. ఎవరికీ కనిపించుకుండా ఉండేందుకు చెట్టెక్కి కూర్చున్నాడు.

Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ వద్దంటూ చెట్టెక్కి కూర్చున్న యువకుడు

Vaccine

Updated On : December 29, 2021 / 3:01 PM IST

Corona Vaccine : గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను పట్టిపీడిస్తోంది. కరోనా బారిన పడి లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కరోనా విలయం తాండవం చేస్తూనేవుంది. కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారత్ లో కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ తప్పనిసరంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ చేయించుకోవాలని సూచనలు కూడా చేస్తున్నాయి. కానీ కొంతమంది మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవడానికి జంకుతున్నారు. టీకాలు అంటేనే పరార్ అవుతున్నారు. వ్యాక్సిన్ పట్ల వారికున్న భయాలు, అపోహాల వల్ల ఆమడ దూరంలో ఉంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి పుదుచ్చేరిలో చోటు చేసుకుంది.

Woman Fight: మాస్క్ పెట్టుకోమన్నందుకు పోలీసులతో మహిళ ఫైట్

విలియనూరులో తనకు కరోనా వ్యాక్సిన్ వద్దని ఓ యువకుడు పారిపోయాడు. ఎవరికీ కనిపించుకుండా ఉండేందుకు చెట్టెక్కి కూర్చున్నాడు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు తన ఇంటివైపు వస్తున్న ఆరోగ్య కార్యకర్తలను చూసిన యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేసినా వినిపించుకోకుండా చెట్టుపైనే ఉండిపోయాడు.