Election Commission of India : ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టుకు ఈసీ వెల్లడి

ఓటర్ల నమోదులో తగిన స్పష్టమైన మార్పులు జారీ చేయనున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటరు నమోదు ప్రక్రియలో ఓటరుగా గుర్తింపును ధృవీకరించడానికి మాత్రమే ఆధార్ సంఖ్యను కోరినట్లు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది.....

Election Commission of India : ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టుకు ఈసీ వెల్లడి

Aadhaar voter card

Updated On : September 22, 2023 / 8:30 AM IST

Election Commission of India : ఓటర్ల నమోదులో తగిన స్పష్టమైన మార్పులు జారీ చేయనున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటరు నమోదు ప్రక్రియలో ఓటరుగా గుర్తింపును ధృవీకరించడానికి మాత్రమే ఆధార్ సంఖ్యను కోరినట్లు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక వ్యక్తిని ఓటరుగా చేర్చుకోవడానికి ఆధార్ నంబర్ ఇకపై తప్పనిసరి కాదని భారత ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు చెప్పింది. (Aadhaar number not mandatory to register as voter)

Varanasi : రూ.451 కోట్లతో వరణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం…రేపు మోదీ శంకుస్థాపన

చీఫ్ జస్టిస్ చంద్రచుడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జెబి పార్డి వాలా, మనోజ్ మిర్రాలతో కూడిన ధర్మాసనం ముందు ఈసీ (Election Commission of India) నివేదిక సమర్పించింది. ఆధార్ సంఖ్య వివరాలు ఓటర్ల నమోదు (సవరణ) నిబంధనల రిజిస్ట్రేషన్ రూల్ 26-బి ప్రకారం తప్పనిసరి కాదని ఈసీ పేర్కొంది.