ఢిల్లీ ఎన్నికల్లో పాకిస్థాన్‌పై ఇండియా గెలిచిందీ…!!

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 07:23 AM IST
ఢిల్లీ ఎన్నికల్లో పాకిస్థాన్‌పై ఇండియా గెలిచిందీ…!!

Updated On : February 11, 2020 / 7:23 AM IST

ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తనదైన శైలిలో విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ నాయకులు సంజయ్ సింగ్, ఎన్డి గుప్తా, సుశీల్ గుప్తా పార్టీ కార్యాలయంలో వేడుకలు జరుపుకుంటారు. ఢిల్లీ ఎన్నికలలను ఆప్ నేత సంజయ్ సింగ్ పాకిస్థాన్ ఇండియా మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ తో పోల్చుతూ..బీజేపీ పార్టీని పాకిస్థాన్ గా..ఆప్ పార్టీని ఇండియా టీమ్ తోను పోలుస్తూ..’ఆజ్ హిందుస్తాన్ జీత్ గయా’ (ఇండియా గెలిచింది) అని సంజయ్ సింగ్ చెప్పారు. ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పబడింది. పర్ ఆజ్ హిందుస్తాన్ జీత్ గయా! అంటూ నినాదాలు చేశారు. 

70 స్థానాలున్న ఢిల్లీలో ఆప్‌ ప్రస్తుతం 57స్ధానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 13స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. 2015 ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలు గెలుచుకున్న బీజేపీ పుంజుకోవడం ఒక్కటే ఆ పార్టీకి ఊరట ఇస్తోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటంటే ఒక్కస్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయింది. విజయం ఖాయమవడంతో ఆప్‌ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆప్‌ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్‌ మొదటి నుంచి లీడ్‌లో కొనసాగుతుతోంది. మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. ఆరు జిల్లాల్లో ఆప్‌ ఏకపక్షంగా దుమ్మురేపింది. న్యూఢిల్లీ పరిధిలోని 10 స్థానాల్లో ఆప్‌ దూకుడు కొనసాగుతోంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ అధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ 40 శాతానికి పైగా ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌ కేవలం 4శాతం ఓట్లు సాధించింది. ఢిల్లీ కంటోన్మెంట్‌, ద్వారాకా, జనక్‌ పురి, కృష్ణానగర్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.