ఆప్ మేనిఫెస్టో రిలీజ్ :  మోడీ,షాల నుంచి దేశాన్ని కాపాడాలి 

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 07:41 AM IST
ఆప్ మేనిఫెస్టో రిలీజ్ :  మోడీ,షాల నుంచి దేశాన్ని కాపాడాలి 

Updated On : May 28, 2020 / 3:40 PM IST

ఢిల్లీ :  ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోని పార్టీ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ రిలీజ్  చేశారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతు..భార‌తీయ ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ర‌క్షించ‌డ‌మే 2019 ఎన్నిక‌ల మ్యానిఫెస్టో అని ఆ పార్టీ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. మోడీ..అమిత్ షాల నుంచి భారతదేశాన్ని కాపాడాలని కేజ్రీవాల్ ప్రజలకు పిలునిచ్చారు.  అమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలదేననీ..వాళ్లే పార్టీని గెలిపించుకుంటారని ధీమా వ్యక్తంచేశారు. 
Also Read : తూచ్ : ప్రియాంక కాదు.. వారణాసిలో మోడీపై పోటీగా ఎవరంటే?

ఢిల్లీలోని కాలేజీల్లో 85 శాతం సీట్ల స్థానికులకు కేటాయిస్తామని..25 శాతం కూడా స్థానికులకు ఉద్యోగాలు రావటంలేదన్నారు. ఢిల్లీ ఓటర్లలో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారనీ తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం హయాంలో దేశ ఐక్యత  ప్ర‌మాదంలో పడిందనని..విచ్ఛిన్న‌క‌ర శ‌క్తుల నుంచి దేశాన్ని ర‌క్షించుకునేందుకు ఆ మ్యానిఫెస్టోను త‌యారు చేశామ‌ని సీఎం కేజ్రీ తెలిపారు. ఢిల్లీలోకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాల‌ని కేజ్రీవాల్ ఈ సందర్భంగా  డిమాండ్  చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ఢిల్లీ ప‌రిధిలోని ఏడు సీట్లు కీల‌కం కానున్నాయ‌న్నారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, ఆరోగ్యం, కాలుష్యం, అవినీతి లాంటి అంశాలు ఢిల్లీని పీడిస్తున్నాయ‌ని, రాష్ట్ర పాలన సవ్యంగా జరగకుండా కేంద్రం వ్యవహరిస్తోందని అందుకే ఇటువంటి పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. కాగా మే 12న ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న..జరగాల్సిన ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడి కానున్నాయి.