ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ప్రభంజనం : మూడోసారి అధికారంలోకి కేజ్రీవాల్
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దుమ్మురేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దుమ్మురేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దుమ్మురేపుతోంది. ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆరు జిల్లాల్లో హవా చూపించింది. మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో అధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాలకుగానూ ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 51 స్థానాల్లో ఆప్, 19 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఎగ్జిట్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి.
న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత కేజ్రీవాల్, పట్ పడ్ గంజ్ లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ముందంజలో కొనసాగుతున్నారు. ఆదర్శ్ నగర్ లో పవన్ శర్మ (ఆప్) ముందంజలో ఉన్నారు. షాకూర్ బస్తీలో మంత్రి సత్యేంద్ర జైన్ ఆధిక్యంలో ఉన్నారు. న్యూఢిల్లీ, ఉత్తర ఢిల్లీలో ఆప్ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తోంది. షార్దాన్, దక్షిణ ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ, నైరుతి ఢిల్లీలో ఆప్ ఏకపక్షంగా దూసుకెళ్తోంది.
బీజేపీ..లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినా.. అసెంబ్లీ ఫలితాల్లో చతికిలబడింది. రోహిణిలో విజేందర్ గుప్తా (బీజేపీ), బగ్గాలో తాజిందర్ పాల్ సింగ్ (బీజేపీ) ముందంజలో ఉన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్, కొండ్లి, కృష్ణానగర్, ద్వారకా, జనక్ పురి, మోతీనగర్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ గతం కంటే పుంజుకున్నా..అధికారానికి దూరంగానే ఉంది. 2015లో బీజేపీ మూడు స్థానాలను గెలుచుకుంది. ఆప్ దెబ్బకు బీజేపీ, కాంగ్రెస్ విలవిల్లాడుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల సిబ్బంది లెక్కించారు. మొత్తం 21 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. 2600 సిబ్బందితో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా 10-14 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలకు పోటీచేసిన 672 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలిపోనుంది. మధ్యాహ్నం కల్లా #DelhiResults వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీదే అధికారమని ఎగ్జిట్ ఫోల్స్ కూడా తేల్చేశాయి.