Ayodhya Ram Mandir Inauguration : అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠకోసం 84 సెకన్ల అభిజిత్ ముహూర్తం.. మీరూ ఇంట్లో కూర్చొని ఇలా పూజించవచ్చు
పండితుల వివరాల ప్రకారం.. 84సెకన్ల సమయం చాలా శుభప్రదమైంది. ఈ శుభముహూర్తంలో పూజించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి.. రాంలల్లా జీవితం పవిత్రం అయ్యే 84 సెకన్లలో ప్రతిఒక్కరూ రాముడి నామాన్ని పటించాలి.

Ram Mandir Inauguration
Ram Mandir : 500ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఇవాళ్టితో తెరపడనోంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12గంటల 29 నిమిషాల 8 సెకన్లు నుండి.. మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల 32 సెకన్లు అభిజిత్ ముహూర్తం, ఇంద్రయోగం, మృగశిర నక్షత్రం, మేష లగ్నం, వృశ్చిక నవాంశలలో పౌషమాసం ద్వాదశి తిథిలో ఈ కార్యక్రమం జరగనుంది. అయోధ్యలో 84 సెకన్ల అభిజీత్ ముహూర్తం ఉందని, ఈ సమయంలో అయోధ్యకు వెళ్లలేక పోయిన వారు.. దగ్గరలోని దేవాలయానికి వెళ్లి.. ఒకవేళ గుడికి వెళ్లలేని వారు ఇంటిలో కూర్చొని మంత్రాలు పఠిస్తూ శ్రీరాముని పూజిస్తే సరిపోతుంది.
పండితుల వివరాల ప్రకారం.. 84సెకన్ల సమయం చాలా శుభప్రదమైంది. ఈ శుభముహూర్తంలో పూజించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి.. రాంలల్లా జీవితం పవిత్రం అయ్యే 84 సెకన్లలో ప్రతిఒక్కరూ రాముడి నామాన్ని పటించాలి. సుందరకాండతో పాటు రామచరిత మానస్ కూడా పఠించాలి. 84సెకన్ల సమయం చాలా తక్కువ సమయం. ఆ సమయంలో మొత్తం రామాయణ పారాయణం సాధ్యంకాదు. అయితే, శ్రీరాముని ప్రతిష్ఠాపన సమయంలో ఖచ్చితంగా శ్రీరామచంద్ర కృపాల్ భజమాన్ పఠించండి. ఇలా చేయడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని పండితులు పేర్కొన్నారు.