ఆ ఆవును నేను కొంటాను:Online చదువులకోసం ఆవును అమ్మిన తండ్రి కష్టానికి సోనూసూద్ సహాయం

హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి ప్రాంతంలో గుమ్మేర్ గ్రామంలో కులదీప్ కుమార్ అనే రైతు తన పిల్లలకు ఆన్ లైన్ చదువులు అందించటం కోసం తన కుటుంబానికి జీవాధారంగా ఉన్న ఒకే ఒక్క ఆవును అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ పేద తండ్రి కష్టాలు మీడియా ద్వారా తెలుసుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ కదిలిపోయారు. కులదీప్ కు సహాయం చేయటానికి ముందుకొచ్చారు. వలస కార్మికుల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద మనస్సు చాటుకున్న సోనూసూద్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రభుత్వాలు కూడా చేయలేని ఆపన్న హస్తాన్ని అందించారు వలసకూలీలకు సోనూ సూద్.
కులదీప్ తన ఒక్క ఆవును రూ.6,000కు అమ్మి పిల్లకు స్మార్ట్ ఫోన్ కొన్న విషయం తెలుసుకుని ఆ ఆవును తిరిగి తానే కొని ఆ పేద తండ్రికి ఇవ్వాలనుకున్నారు సోనూసూద్. ఆ ఆవును ఎవరు కొన్నారో తెలుసుకునే పనిలో పడ్డారు. ఓ ఇంగ్లీష్ పత్రికలో పడిన పేపర్ కటింగ్ ను తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ దయచేసి..‘రండి ఈ వ్యక్తి ఆవును తిరిగి తీసుకుందాం.. అతడి వివరాలను నాకు ఎవరైనా పంపగలరా’ అని సోనూ ట్వీట్ చేశారు సోనూసూద్.
Let’s get this guy’s cows back. Can someone send his details please. https://t.co/zv0Mj8DCh9
— sonu sood (@SonuSood) July 23, 2020
తన ట్వీట్ తో పాటు ఆ వార్తను కూడా జోడించారు. ఆ వ్యక్తి పాలంపూర్ నివాసి అని సోనూకి నెటిజన్లు సమాచారం ఇచ్చారు. దాంతో సోను అతడి ఆవుని అతడికి కొనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రీల్ లైఫ్ లో విలన్ వేషాలు వేసిన అభిమానుల హృదయాలను దోచుకున్నాడు ఈ ఆరడుగుల అందగాడు.పేదలకు చేస్తున్న సహాయ సహకారాల గురిచి పలు రాష్ట్రాల సీఎంలే సోనూను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రశ్నంచిచారు. అందం మనిషికే కాదు మనస్సులోను ఉందని నిరూపించాడు ఈ ఆరడుగుల అందగాడు.
నెటిజన్లు ఇచ్చిన సమాచారంతో ఆ ఆవుని తిరిగి కొని కులదీప్ కు ఇచ్చే పనిలో పడ్డారు సోనూసూద్. అంతేకాదు వారి పిల్లల చదువులకు కూడా సహాయం చేస్తానంటున్న సోనూ డార్లింగ్ కు హాట్సాఫ్..హాట్సాఫ్..