poonam kaur : మహిళా రిజర్వేషన్ బిల్లుపై నటి పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్
ప్రధాని మోదీ కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీనిపై దేశవ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

poonam kaur
poonam kaur women reservation bill : ఎన్నాళ్లగానో పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విముక్తి కల్పిస్తుంది అనే వార్తలు వస్తున్న క్రమంలో ఎంతోమంది ఈ బిల్లు గురించి ఎంతోమంది చేస్తున్న ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. ఈక్రమంలో ప్రముఖ నటి పూనమ్ కౌర్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. గత కొంతకాలంలో వార్తల్లో నిలుస్తున్న నటి పూనమ్ కౌర్ రాజకీయాల గురించి కూడా స్పందిస్తన్నారు. తన ట్వీట్లు వైరల్ అవుతున్న క్రమంలో తాజాగా ఆమె మహిళా రిజర్వేషన్ బిల్లుపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇప్పటికే ప్రధాని మోదీ కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీనిపై దేశవ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బిల్లు లోక్ సభలో పాస్ కావడం ఒకటే మిగిలి ఉంది. ఈక్రమంలో ఈ బిల్లుకు ఇక విముక్తి లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతున్న క్రమంలో పూనమ్ కౌర్ స్పందిస్తు..”మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తే ఏళ్ల తరబడి పెరుగుతున్న నేరాల రేటు తగ్గుతుంది – రాజకీయ దురాశకు, కీర్తికి అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయంగా ఉపయోగపడేలా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని ఈ గణేష్ చతుర్థిని ప్రార్థిస్తున్నాను” అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.
Women’s Reservation Bill : కేంద్రం సంచలన నిర్ణయం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. బిల్లుపై చర్చించడానికి కేబినెట్ భేటీకి కొద్ది గంటల ముందే పూనమ్ ట్వీట్ చేయడం.. ఆ తర్వాత అదే బిల్లును మంత్రివర్గం ఆమోదం తెలపడం ఆసక్తిగా మారింది. కేబినెట్ ఆమోదం పలికి చాలా వరకు దీనికి అడ్డంకులు తొలగించినట్లు అయ్యింది. ఇక సభ ఆమోదం కూడా పొందుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
If passing the #womensreservationbill will reduce the crime rate which has been increasing over the years – I pray this Ganesh Chaturthi that this should be passed unanimously keeping in mind to be used rightfully for all sections of the society, beyond political greed or glory?
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 18, 2023