IIFL Wealth-Hurun India Report : అదానీ ఆదాయం రోజుకి రూ.వెయ్యి కోట్లు
అదానీ గ్రూప్ చైర్మన్ మరియు ఆసియాలో 2వ అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ(59)కి కరోనా కాలం అద్భుతంగా కలిసి వచ్చింది. గత ఏడాది కాలంలో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యుల మొత్తం సంపద ఏకంగా

Adani
IIFL Wealth-Hurun India Report అదానీ గ్రూప్ చైర్మన్ మరియు ఆసియాలో 2వ అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ(59)కి కరోనా కాలం అద్భుతంగా కలిసి వచ్చింది. గత ఏడాది కాలంలో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యుల మొత్తం సంపద ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది. IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం..2019-20లో రూ.1,40,200 కోట్లుగా ఉన్న అదానీ సంపద.. 2020-21లో రూ.5,05,900 కోట్లకు చేరింది. గత ఏడాదిలో గౌతమ్ అదానీ కుటుంబం రోజువారీగా రూ.1,002 కోట్లు సంపాదించాడు.
ఇక ముఖేష్ అంబానీ రూ. 7.18 లక్షల కోట్ల ఆస్తులతో జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. 2020-21 కాలంలో ముకేశ్ అంబానీ మొత్తం సంపద 9 శాతం పెరిగి రూ.7.18 లక్షల కోట్లకు చేరింది. అయితే ముకేష్ అంబానీ రోజువారీ సంపాదన మాత్రం రూ.163 కోట్లుగా ఉంది.

Adani (1)
టాప్ -10 జాబితాలో స్టీల్ కింగ్ లక్ష్మి నివాస్ మిట్టల్ & ఫ్యామిలీ రోజువారీ సంపాదనలో రెండవ స్థానంలో ఉంది. అతను రోజూ 312 కోట్లు సంపాదించాడు. హెచ్‌సీఎల్ అధినేత శివ్ నాడార్ కుటుంబ సందప కూడా గతేడాది ఏకంగా 67 శాతం పెరిగి రూ.2.36 లక్షల కోట్లకు చేరడం విశేషం. శివ్ నాడార్ & ఫ్యామిలీ రోజూ రూ. 260 కోట్ల సంపాదనతో మూడవ స్థానంలో ఉంది. తొలిసారిగా గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ టాప్ -10 లో చోటు దక్కించుకున్నారు. ప్రతి రోజూ రూ. 245 కోట్లు సంపాదనతో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ నాల్గవ స్థానంలో నిలిచారు. వినోద్ శాంతిలాల్ అదానీ ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నాడు. ఇక, కుమార్ మంగళం బిర్లా రోజుకి 242 కోట్లు సంపాదనతో ఐదవ స్థానంలో ఉన్నారు. వ్యాక్సిన్ కింగ్ సైరస్ పూనవల్ల & ఫ్యామిలీ ప్రతిరోజూ రూ. 190 కోట్లు సంపాదించింది.
Allu Aravind : ఇండస్ట్రీని దయచేసి అర్థం చేసుకోండి – అల్లు అరవింద్
ఇండియాలోని 119 నగరాల్లో కనీసం రూ.1000 కోట్ల సంపద ఉన్న 1007 మంది వ్యక్తుల సంపద గతేడాది 51 శాతం పెరిగింది. నివేదిక ప్రకారం వార్షిక ప్రాతిపదికన…వినోద్ శాంతిలాల్ అదానీ ఆస్తులలో 21.20 శాతం, శివ్ నాడార్ ఆస్తులలో 67 శాతం, ఎల్ఎన్ మిట్టల్ ఆస్తులలో 187 శాతం, సైరస్ పూనవల్ల ఆస్తులలో 74 శాతం కుమార్ మంగళం బిర్లా ఆస్తులలో సంవత్సరానికి 230 శాతం పెరుగుదల ఉంది.
ఇండియాలో గతేడాది కొత్తగా 58 మంది బిలియనీర్లు చేరడం విశేషం. దీంతో దేశంలో 2020-21లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 258కి చేరింది. ఇక ఇండియాలో యంగెస్ట్ బిలియనీర్‌గా భారత్‌పె పేమెంట్స్ యాప్ కోఫౌండర్ శాశ్వత్ నక్రానీ నిలిచారు.