Yogi Govt: కొత్త మదర్సాల అనుమతికి నో చెప్పిన యోగి ప్రభుత్వం
ఇకపై ఉత్తరప్రదేశ్‌లో కొత్త మదరసాల ఏర్పాటు చేసుకోవడానికి వచ్చే అనుమతులు నిరాకరించాలని వచ్చిన ప్రతిపాదనకు యోగి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం క్యాబినెట్ మీటింగ్ లో ప్రవేశపెట్టిన ప్రపోజల్ కు సమ్మతాన్ని తెలియజేశారు.

Yogi Adithya Nath
Yogi Govt: ఇకపై ఉత్తరప్రదేశ్‌లో కొత్త మదర్సాల ఏర్పాటు చేసుకోవడానికి వచ్చే అనుమతులు నిరాకరించాలని వచ్చిన ప్రతిపాదనకు యోగి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం క్యాబినెట్ మీటింగ్ లో ప్రవేశపెట్టిన ప్రపోజల్ కు సమ్మతాన్ని తెలియజేశారు. గతనెలలో మదరసా మోడరనైజేషన్ స్కీంలో భాగంగా మదర్సాలపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.
అధికారిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని 16వేల మదర్సాల్లో కేవలం 558కి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20లక్షల స్టూడెంట్లు వీటిలో విద్యాభ్యాసం చేస్తున్నారు.
బడ్జెట్ 2021-22లో భాగంగా మదర్సా మోడరనేజేషన్ స్కీం కోసం ప్రభుత్వం రూ.479కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన, ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ మదర్సాలన్నింటిలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
Read Also: సీఎం యోగి మరో కీలక నిర్ణయం.. మదర్సాలలో జాతీయ గీతం తప్పనిసరి!
మదర్సా విద్యార్థులు దేశభక్తితో నిండి ఉండాలని ఆదిత్యనాథ్ ప్రభుత్వం కోరుకుంటోందని మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ అన్నారు. జాతీయ గీతం ఆలపిస్తే విద్యార్థులు సమాజ విలువలను నేర్చుకుంటారని అన్నారు.