Punjab Elections: నా టికెట్ ను సోనూసూద్ చెల్లికి ఇచ్చారు అందుకే బీజేపీలో చేరా: హర్ జోత్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మొగా నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే హర్ జోత్ ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ కండువా కప్పుకున్నారు.

Punjab Elections: నా టికెట్ ను సోనూసూద్ చెల్లికి ఇచ్చారు అందుకే బీజేపీలో చేరా: హర్ జోత్

Harjot

Updated On : January 16, 2022 / 12:32 PM IST

Punjab Elections: ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పంజాబ్ కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మొగా నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే హర్ జోత్ ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ కండువా కప్పుకున్నారు. 2017లో మొగా అసెంబ్లీ స్థానంలో గెలిచిన హర్ జోత్ కమల్.. బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ అధిష్టానం ఒక్కసారిగా కంగుతినింది. కాగా హర్ జోత్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మొగా స్థానంలో.. సోనూసూద్ సోదరి, మాళవిక సూద్ కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. పార్టీ నిర్ణయంతో ఏకీభవించని హర్ జోత్ కమల్ కాంగ్రెస్ ను వీడి భాజపాలో చేరారు. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిందని.. అందుకే బీజేపీలో చేరి అదే స్థానంలో పోటీలో నిలబడనున్నట్లు హర్ జోత్ ప్రకటించారు.

Also read: Kanuma Special: కోనసీమలో కనులపండువగా ప్రభల తీర్థం ఉత్సవాలు

టికెట్ ఇవ్వకపోగా తనను వేరే స్థానం నుంచి పోటీ చేసుకోమని బిరుసు సమాధానం ఇచ్చారంటూ హర్ జోత్ ఆవేదన వ్యక్తం చేశారు. 21 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన తానూ..మొగా నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దానని పేర్కొన్నారు. టికెట్ కేటాయింపులపై మాట మాత్రం చెప్పలేదని, రెండు రోజుల క్రితం మొగా పర్యటనకు వచ్చిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్దు..తనను కలవకుండా నేరుగా సూద్(సోనూసూద్) ఇంటికి వెళ్లారని.. హర్ జోత్ కమల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also read: Vijayawada News: ఇంద్రకీలాద్రి పై కరోనా కలకలం

సోనూసూద్ సోదరి మాళవికాకు టికెట్ ఇవ్వడంలో తనకేమి అభ్యంతరం లేదని.. సొంతచెల్లెలి లాంటి ఆమెకు టికెట్ ఇవ్వడంపై తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు హర్ జోత్ కమల్ చెప్పుకొచ్చారు. అయితే సొంత నియోజకవర్గం మొగా టికెట్ ను తనకు కాదని ఆమెకు ఎలా ఇస్తారంటూ హర్ జోత్ ప్రశ్నించారు. కేవలం సోనూసూద్ చెల్లిగా తప్ప, మాళవికాకు ఉన్న రాజకీయ పలుకుబడి ఏంటంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై పీపీసీసీ అధ్యక్షుడు సిద్దు స్పందిస్తూ..హర్ జోత్ తనకు ఎంతో ఆప్తమిత్రుడని అన్నారు. సీఎం చరణ్జిత్ స్పందిస్తూ పార్టీ అధిష్టానం మేరకే తామంతా నడుచుకుంటున్నట్లు తెలిపారు.

Also read: EV Charging: దేశంలో ఎవరైనా ఎక్కడైనా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు