Kerala : సుప్రీం ఆగ్రహం..కేరళలో లాక్ డౌన్ నిబంధనలు వారం పొడిగింపు
కేరళలో సగటు టెస్ట్ పాజిటివిటీ రేటు ఇంకా 10 శాతానికి మించి ఉన్న నేపథ్యంలో కేరళలో మరో వారం లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్లు సీఎం పిన్నరయి విజయన్ మంగళవారం(జులై-20,2021)ప్రకటించారు.

Court3
Kerala కేరళలో సగటు టెస్ట్ పాజిటివిటీ రేటు ఇంకా 10 శాతానికి మించి ఉన్న నేపథ్యంలో కేరళలో మరో వారం లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్లు సీఎం పిన్నరయి విజయన్ మంగళవారం(జులై-20,2021)ప్రకటించారు. అయితే బక్రీద్ ను పురస్కరించుకుని కరోనా ఆంక్షల నుంచి మూడు రోజుల మినహాయింపు ఇచ్చిన కేరళ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన గంటల్లోనే లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్లు సీఎం ప్రకటిచడం గమనార్హం.
సీఎం విజయన్ మాట్లాడుతూ.. జూలై 21 న బక్రీద్ జరుపుకునే నేపథ్యంలో అనుమతిచ్చిన మూడు రోజుల కోవిడ్ ఆంక్షల సడలింపు మంగళవారం ముగుస్తుందని.. శుక్రవారం మూడు లక్షల అదనపు కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించనున్నట్లు విజయన్ తెలిపారు.
కాగా,కేరళలో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ 10వేలకు పైగానే కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం(జులై-20,2021)కేరళలో కొత్తగా 16,848 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా,104 మరణాలు నమోదయ్యాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు 11.91శాతంగా ఉన్నట్లు కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది.