CNX Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‭కు లాభమే, అయినా బీజేపీ కంటే చాలా వెనుకే.. ఇండియాటీవీ-సీఎన్ఎక్స్ సర్వే

ఇతర ప్రాంతాల గురించి మాట్లాడితే, చంబల్‌లో బీజేపీకి మూడు సీట్లు, కాంగ్రెస్‌కు ఒక సీటు.. మహాకౌశల్‌లో బీజేపీకి నాలుగు సీట్లు, కాంగ్రెస్‌కు ఒక సీటు.. మాల్వా ప్రాంతంలో నాలుగు సీట్లూ బీజేపీకే.. భోపాల్‌లాగా మాల్వాలో కాంగ్రెస్‌కు ఏదైనా సీటు వచ్చే అవకాశం ఉందట

CNX Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‭కు లాభమే, అయినా బీజేపీ కంటే చాలా వెనుకే.. ఇండియాటీవీ-సీఎన్ఎక్స్ సర్వే

Updated On : July 28, 2023 / 7:28 PM IST

India TV-CNX Survey: ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా రాజకీయ పార్టీలకు తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి మరియు తమ బలాన్ని అంచనా వేసుకోవడానికి అవకాశంగా మారనున్నాయి. మధ్యప్రదేశ్‌లో 29 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్ని సీట్లు గెలుస్తాయనేది ప్రధాన అంశం. దీనికి సంబంధించి జరిపిన సర్వేలో బీజేపీకి స్వల్ప నష్టం, కాంగ్రెస్‌కు స్వల్ప లాభం కనిపిస్తోంది. ఇండియాటీవీ-సీఎన్ఎక్స్ సర్వే (India TV-CNX) సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడి అయ్యాయి.

Karnataka: పార్కింగ్ రద్దీతో చిర్రెత్తుకొచ్చి సీఎం కారుకే అడ్డు తిరిగాడు.. తర్వాత ఏం జరిగిందంటే?

మధ్యప్రదేశ్‌కు సంబంధించి నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో సీట్ల స్థాయిలో పార్టీల స్థానం, ప్రాంతాల వారీ స్థానం, ఓట్ల శాతంపై సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం ఇక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగిలిపోతుందని, అయితే నాలుగు సీట్లు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 28 సీట్లు గెలుపొందగా, ఈసారి 24 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌కు నాలుగు స్థానాలు దక్కనున్నాయి. 2019లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే తాజా సర్వేలో కాంగ్రెస్‌కు ఐదు సీట్లు వస్తాయని తేలింది.

Telangana Assembly Meetings : ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వర్షాలు, వరదలతోపాటు పలు కీలక అంశాలపై చర్చ

ఓట్ల పరంగా చూస్తే బీజేపీ ఆధిక్యం కొనసాగుతుందట. ఇక్కడ బీజేపీకి 51 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 39 శాతం ఓట్లు వస్తాయని, 10 శాతం ఓట్లు ఇతరుల ఖాతాలోకి వెళ్తాయని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం ఆరు ప్రాంతాలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా పనితీరు కూడా చాలా ముఖ్యం. ఇక్కడ బాగేల్‌ఖండ్‌లో బీజేపీ ఆరు సీట్లు, కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకోగలవు. భోపాల్‌లో బీజేపీకి మూడు సీట్లు రానుండగా, కాంగ్రెస్‌క ఖాతానే తెరవలేకపోవచ్చని చెప్పారు.

G-20 Summit: ఇండియాలో జరగనున్న జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడి హాజరుపై క్లారిటీ ఇచ్చిన ఆ దేశ విదేశాంగ మంత్రి

ఇతర ప్రాంతాల గురించి మాట్లాడితే, చంబల్‌లో బీజేపీకి మూడు సీట్లు, కాంగ్రెస్‌కు ఒక సీటు.. మహాకౌశల్‌లో బీజేపీకి నాలుగు సీట్లు, కాంగ్రెస్‌కు ఒక సీటు.. మాల్వా ప్రాంతంలో నాలుగు సీట్లూ బీజేపీకే.. భోపాల్‌లాగా మాల్వాలో కాంగ్రెస్‌కు ఏదైనా సీటు వచ్చే అవకాశం ఉందట. మరో ప్రాంతంలో నిమార్‌లో కూడా బీజేపీ ఆధిక్యత కనబరుస్తుందని, ఇక్కడ నలుగురు బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఒక్క సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తుందని సర్వేలో తేలింది.