Republic Day 2024 : జెండా వందనం తర్వాత.. గౌరవాన్ని కాపాడుతూ త్రివర్ణ పతాకాలను ఏం చేయాలో చెప్పిన కేంద్రం

జనవరి 26 రిపబ్లిక్ డే నాడు కాగితంతో తయారు చేసిన జాతీయ జెండాలను ఎగరేసేటపుడు పాటించాల్సిన నియమాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది.

Republic Day 2024 : జెండా వందనం తర్వాత.. గౌరవాన్ని కాపాడుతూ త్రివర్ణ పతాకాలను ఏం చేయాలో చెప్పిన కేంద్రం

Republic Day 2024

Updated On : January 19, 2024 / 5:37 PM IST

Republic Day 2024 : జనవరి 26 రిపబ్లిక్ డే కి ముందు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) రాష్ట్రాలు, మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. కాగితంతో తయారు చేసిన జాతీయ జెండాలను ఎగరవేసిన తర్వాత పాటించాల్సిన నియమాలను సూచించింది. ప్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను ఖచ్చితంగా పాటించాలని కోరింది.

Amazon Republic Day Sale 2024 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ డీల్స్ మిస్ చేసుకోవద్దు!

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు.. జనవరి 26ను మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు దేశ వ్యాప్తంగా జాతీయ జెండాను ఎగరేస్తారు. స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకుంటారు. ప్రజలంతా ఉత్సాహంతో జెండా వందనం కార్యక్రమంలో పాల్గొంటారు.

జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా కాగితంతో తయారు చేసిన జాతీయ జెండాలను ఎగరేసే సమయంలో పాటించాల్సిన నియమాలపై కేంద్ర హోం మంత్రిత్వ రాష్ట్రాలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. ‘భారత జాతీయ జెండా దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను సూచిస్తుందని, జెండా గౌరవానికి అనుగుణంగా పేపర్‌తో తయారు చేసిన త్రివర్ణ పతాకాలను ఎగరేయాలని హోం మంత్రిత్వ శాఖ తన సర్క్యులర్‌లో పేర్కొంది. . ‘ప్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని పార్ట్-11 పేరా 2.2లోని క్లాజ్ ప్రకారం జాతీయ, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలతో పాటు, ముఖ్యమైన సందర్భాలలో కాగితంతో తయారు చేసిన జాతీయ జెండాలను ప్రజలు ఎగరేసిన తర్వాత వాటిని చింపడం, నేలపై విసిరేయడం వంటివి చేయకూడదు. ఖచ్చితంగా ప్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను పాటించాలి. జాతీయ జెండా గౌరవానికి ఏ మాత్రం భంగంగా కలగకుండా కాపాడాలంటూ’ మంత్రిత్వ శాఖ లేఖలో వెల్లడించింది.

Tollywood : రిపబ్లిక్ డేకి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాల ఫైట్..

జనవరి 26, 2024 న భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఈసారి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.