Karnataka: కష్టాల్లో ఇరుక్కున్న కాంగ్రెస్ సర్కార్‭కు కలిసొచ్చిన టాక్స్ కలెక్షన్స్

అందుకు తగినట్టుగానే పన్నుల వసూళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు ఆర్థికశాఖ క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వాణిజ్య పన్నుల ద్వారా రూ.9,311 కోట్లు వసూలయింది. అబ్కారీ శాఖ ద్వారా రెండు నెలల్లో రూ.4,484 కోట్లు ఆదాయం సమకూరింది

Karnataka: కష్టాల్లో ఇరుక్కున్న కాంగ్రెస్ సర్కార్‭కు కలిసొచ్చిన టాక్స్ కలెక్షన్స్

Karnataka Budget: కర్ణాటక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇచ్చిన ఐదు గ్యారెంటీలు సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేవనని విశ్లేషణలు వచ్చాయి. వాటికి అనుగుణంగానే మొదటగా శక్తి యోజన కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించగానే ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల భారం పెరుగుతుందని అధికారిక గణాంకాలే వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆదాయ మార్గాల కోసం అణ్వేషిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి టాక్సులు కలిసి వచ్చాయి.

Opposition Meet: ఒక్క సీటు కూడా లేదు, బీజేపీని ఛాలెంజ్ చేస్తున్నారు.. తేజశ్వీపై సుశీల్ మోదీ సెటైర్లు

2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల్లోనే 25 వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో రావడం సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఊరట లభించినట్టైంది. రాష్ట్ర ప్రభుత్వానికి సొంత పన్నుల మూలమైన వాణిజ్య, ఎక్సైజ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, వాహనాల పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయం సమకూరుతోంది. జూలై 7న కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కొత్త పన్నులను లక్ష్యంగా బడ్జెట్ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్నవి కాకుండా పన్ను విధానాల్లో ప్రభుత్వం కొత్త స్లాబులు తీసుకువస్తోంది. కొత్త యాక్షన్‌ప్లాన్‌ బడ్జెట్ అనంతరం నుంచి అమలులోకి రానుంది.

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭కు షాక్.. మళ్లీ జైలు తప్పేలా లేదు

కొవిడ్‌ తర్వాత రాష్ట్రంలో ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ మెరుగవుతున్నాయి. అందుకు తగినట్టుగానే పన్నుల వసూళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు ఆర్థికశాఖ క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వాణిజ్య పన్నుల ద్వారా రూ.9,311 కోట్లు వసూలయింది. అబ్కారీ శాఖ ద్వారా రెండు నెలల్లో రూ.4,484 కోట్లు ఆదాయం సమకూరింది. మే నెలలో రూ.2,526 కోట్లు వసూలైంది. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ద్వారా రూ.2,624 కోట్లు సాధ్యమైంది. మోటారు వాహనాల పన్నుల ద్వారా ఏప్రిల్‌, మే నెలల్లో రూ.1,562 కోట్లు వసూలు అయ్యాయి.