పంజాబ్ లో ట్రాక్టర్ నడిపిన రాహుల్ 

  • Published By: chvmurthy ,Published On : May 15, 2019 / 02:32 PM IST
పంజాబ్ లో ట్రాక్టర్ నడిపిన రాహుల్ 

Updated On : May 28, 2020 / 3:43 PM IST

పంజాబ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా  రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించటానికి అందివచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంటుంటారు. ఇటీవల హెలికాప్టర్ ను రిపేరు చేసిన రాహుల్ గాంధీ ఇవాళ ట్రాక్టర్ నడిపి ఓటర్లను ఉత్తేజపరిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం పంజాబ్ లోని లూధియానాలో  పర్యటించారు. ఆయన అక్కడ ఒక ట్రాక్టర్ నడిపారు. ట్రాక్టర్ పై రాహుల్ తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి  కెప్టెన్ అమరిందర్ సింగ్, లూధియానా ఎంపీ అభ్యర్ధి రవనీత్ బిట్టు, కాంగ్రెస్ నాయకురాలు అశాకుమారి లతో కలిసి లూధియానా వీధుల్లో ట్రాక్టర్ పై  ఆయన కొద్దిసేపు ప్రచారం చేశారు. 
Also Read : కోల్ కతాలో మమతా రోడ్ షో