Indian intelligence agency: పాక్ ఇంటెలిజెన్స్ అధికారుల వలలో భారత సైనికులు.. విచారణ జరుపుతున్న ప్రభుత్వం

గత నవంబర్‌లో కూడా విదేశాంగ శాఖలో పని చేసే ఒక ఉద్యోగి, పీఐఓస్‌కు కీలక సమాచారం చేరవేసినట్లు వెల్లడైంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. తాజాగా మరోసారి ఇద్దరు అధికారులు ఇలాగే పాక్ అధికారుల వలలో చిక్కినట్లు గుర్తించారు.

Indian intelligence agency: పాక్ ఇంటెలిజెన్స్ అధికారుల వలలో భారత సైనికులు.. విచారణ జరుపుతున్న ప్రభుత్వం

Updated On : January 30, 2023 / 3:05 PM IST

Indian intelligence agency: భారత సైన్యానికి చెందిన ఇద్దరు అధికారులు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారుల (పీఐఓస్) వలలో చిక్కుకున్నట్లు తెలిసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌తోపాటు, ఆర్మీకి చెందిన ఇద్దరు అధికారులు పీఐఓస్‌తో సంప్రదింపులు జరిపినట్లు భారత ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు.

South Africa: బర్త్‌డే పార్టీలో కాల్పులు.. 8 మంది మృతి.. ముగ్గురికి గాయాలు

దీంతో ఈ అంశంపై ప్రభుత్వం అప్రమత్తమై విచారణ జరుపుతోంది. గత నవంబర్‌లో కూడా విదేశాంగ శాఖలో పని చేసే ఒక ఉద్యోగి, పీఐఓస్‌కు కీలక సమాచారం చేరవేసినట్లు వెల్లడైంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. తాజాగా మరోసారి ఇద్దరు అధికారులు ఇలాగే పాక్ అధికారుల వలలో చిక్కినట్లు గుర్తించారు. ఫేస్‌బుక్ ద్వారా పీఐఓస్ దేశంలోని కొందరు పౌరులతోపాటు, ఇద్దరు అధికారులను మచ్చిక చేసుకున్నారు. వారి ద్వారా మన సైన్యానికి సంబంధించి కీలక విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

Hockey World Cup 2023: పురుషుల హాకీ ప్రపంచ కప్ విజేత జర్మనీ.. ఫైనల్‌లో బెల్జియంపై గెలుపు

ఈ విషయాన్ని గుర్తించిన భారత అధికారులు ఆరా తీయగా మన వాళ్లు సంప్రదించిన ఫోన్ నెంబర్లు, ఐపీ అడ్రస్ పాకిస్తాన్‌కు చెందినవిగా గుర్తించారు. గత నెలలో ఈ విషయం వెలుగు చూసింది. ఈ విషయాన్ని గుర్తించడం ద్వారా మన సమాచారం వాళ్లకు చేరకుండా అధికారులు అడ్డుకోగలిగారు. ఇటీవలి కాలంలో పీఐఓస్ చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నారు. దేశ రహస్యాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు పాక్ అధికారులైతే నేరుగా సీఆర్‌పీఎఫ్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి, తాము ఉన్నతాధికారులమని చెప్పి సైన్యం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

Elon Musk: నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఎలన్ మస్క్.. ఐదు కంపెనీల బాధ్యతలతో సతమతం

భారత ఆర్మీకి చెందిన అధికారుల వాట్సాప్ గ్రూపుల్లో కూడా కొందరు పీఐఓస్ అధికారులు ఉన్నట్లు కూడా తేలింది. మన సైన్యానికి చెందిన అధికారులు ఉపయోగించే ఫోన్ నెంబర్లు, ఇంటర్నెట్ వంటి వాటిపై ప్రభుత్వం నిఘా పెడుతుంది. దీని ద్వారా ఎవరైనా విదేశీ సిబ్బంది చేతిలో చిక్కుకున్నారో లేదో తెలుస్తుంది.