తండ్రి కేబినెట్‌లో ఆధిత్య ఠాక్రేకు మంత్రి పదవి: మళ్లీ డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్

శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర కేబినెట్ 36 మంది మంత్రులతో సోమవారం (డిసెంబర్ 30, 2019) విస్తరణ జరిగింది. కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆధిత్య ఠాక్రే (29) కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కేబినెట్ మంత్రిగా ఆధిత్య ఠాక్రే ప్రమాణం :
ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. రాష్ట్ర మండలి మంత్రుల్లో ఒక తండ్రి-కొడుకు కలిసి మంత్రులుగా ఉండటం మహారాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
26 మంది కేబినెట్ .. 10 మంది జూనియర్లు :
గత నవంబర్ నెలలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీతో రాత్రికి రాత్రే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అజిత్ ప్రమాణం చేసి అనూహ్య పరిణామాలతో రాజీనామా చేశారు. ఇప్పుడు ఉద్ధవ్ నేతృత్వంలోని కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు అజిత్.
దీంతో ఒక నెల వ్యవధిలోనే రాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ రెండు సార్లు ప్రమాణం చేసిన ఘనత ఈయనకే దక్కింది. మొత్తం 36 మంత్రుల్లో 26 మంది మంత్రులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయగా, మిగతా 10 మంది మంత్రులు జూనియర్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
ముగ్గురు మహిళలకు చోటు :
మంత్రిమండలిలో మొత్తం ముగ్గురు మహిళలతో విస్తరించగా.. వారిలో కేబినెట్ రెండు ర్యాంకుల్లో కాంగ్రెస్ నుంచి వర్షా గైక్వాడ్, యశ్మోతి థాకూర్ చోటు దక్కగా, NCP నుంచి అధితి ఠాక్రేకు చోటు దక్కింది. కొత్త మంత్రి మండలిలో ఇప్పుడు నలుగురు ముస్లింలు మంత్రులుగా ఉన్నారు. వారిలో NCP నుంచి నవాబ్ మాలిక్, హసన్ ముషారఫ్, కాంగ్రెస్ నుంచి అస్లామ్ షేక్, శివసేన నుంచి అబ్దుల్ సత్తార్ ఉన్నారు. అబ్దుల్ సత్తార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాగా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన శివసేనలో చేరారు.
మరోవైపు, ఆధిత్యతో పాటు సీనియర్ NCP నేత, MP సునీల్ ఠాక్రే కుమార్తె అధితి కూడా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు. ఇతర రాజకీయ వారసుల్లో అమిత్ దేశ్ ముఖ్ సహా అతడి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్, వర్షా గైక్వాడ్, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కుమార్తె ఎక్తనాథ్ గైక్వాడ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వజీత్ కదమ్, దివంగత కాంగ్రెస్ నేత కుమారుడు పతంగ రావు కదమ్ తదితరులు ఉన్నారు.
ముగ్గురు స్వతంత్రులకు చోటు :
తన కేబినెట్ లో ఉద్ధవ్ ముగ్గురు స్వతంత్రులకు కూడా చోటు కల్పించారు. వారిలో రైతు నేత, నాలుగు సార్లు విదర్భ నుంచి స్వతంత్ర శాసనసభ్యుడిగా ఎన్నికైన బచ్చు కడూ, అహ్మద్ నగర్ నుంచి శంకర్ గడ్డఖ్, కోల్హాపూర్ నుంచి రాజేంద్ర యద్రావకార్ ఉన్నారు.
ఈ స్వతంత్రలంతా కలిసి శివసేనకు మద్దతు పలికినవారిలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌవాన్ కాంగ్రెస్ పార్టీ వీడటంతో ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా స్థానం కల్పించారు. కానీ, ఆయన స్థానంలో మరో మాజీ సీఎం అశోక్ చౌవాన్‌కు కేబినెట్‌లో చోటు దక్కింది.