అవినీతి అంతం : ప్రమాణస్వీకారం చేసిన లోక్‌పాల్‌ సభ్యులు

లోక్ పాల్ కార్యాలయ జ్యుడిషియల్ సభ్యులుగా బుధవారం జస్టిస్ ప్రదీప్ కుమార్,జస్టిస్ దిలీప్ బి బోసలే,జస్టిస్ అభిలాషా కుమారి,జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి ప్రమాణ స్వీకారం చేశారు.

  • Published By: venkaiahnaidu ,Published On : March 27, 2019 / 12:29 PM IST
అవినీతి అంతం : ప్రమాణస్వీకారం చేసిన లోక్‌పాల్‌ సభ్యులు

Updated On : March 27, 2019 / 12:29 PM IST

లోక్ పాల్ కార్యాలయ జ్యుడిషియల్ సభ్యులుగా బుధవారం జస్టిస్ ప్రదీప్ కుమార్,జస్టిస్ దిలీప్ బి బోసలే,జస్టిస్ అభిలాషా కుమారి,జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి ప్రమాణ స్వీకారం చేశారు.

లోక్ పాల్ కార్యాలయ జ్యుడిషియల్ సభ్యులుగా బుధవారం(మార్చి-27,2019) జస్టిస్ ప్రదీప్ కుమార్,జస్టిస్ దిలీప్ బి బోసలే,జస్టిస్ అభిలాషా కుమారి,జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి ప్రమాణ స్వీకారం చేశారు. నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యులుగా సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) మాజీ ఉమెన్ చీఫ్ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ జైన్‌, ఐఆర్‌ ఎస్‌ మాజీ అధికారి మహేంద్ర సింగ్‌, ఐఏఎస్‌ మాజీ అధికారి ఇంద్రజీత్ ప్రసాద్‌ గౌతమ్ ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 8మంది సభ్యులతో జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.
Read Also : చౌకీదార్ కి బీజేపీ ఎంపీ రాజీనామా లేఖ

భారత తొలి లోక్‌పాల్‌ చైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ మార్చి-23,2019న ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రికమండేషన్ ప్రకారం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ లోక్ పాల్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు.2017 మే నెలలో సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ ఘోష్ రిటైర్డ్ అయ్యారు.జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC)సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు.

బుధవారం ఎనిమిది మంది సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియడంతో లోక్‌పాల్‌ కార్యాలయం తమ విధుల కార్యాచరణను మొదలు పెట్టిందని సంబంధిత అధికారి తెలిపారు.ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌, ఛత్తీస్‌గఢ్‌ మంత్రి టీఎస్‌ సింగ్‌ డియోతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.నిఘా సంస్థ అధినేత రాజీవ్‌ జైన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరీతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చే వారిపై విచారణ జరిపే అధికారం లోక్‌పాల్‌, లోకాయుక్తాలకు ఉంటుంది.2013లోనే లోక్ పాల్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు.సుప్రీంకోర్టు జోక్యంతో ఎట్టకేలకు భారత్ లో లోక్ పాల్ వ్యవస్థ ఏర్పాటైంది.
Read Also : మాస్టర్ పీస్ : 1300 హిస్టరీ ఈ హోటల్ సొంతం