కేంద్రంపై మమతా సెటైర్లు: బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులే

కేంద్రంపై మమతా సెటైర్లు: బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులే

Updated On : March 4, 2020 / 5:29 AM IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మరోసారి సెటైర్లు విసిరారు. బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పాల్గొన్న వారంతా భారత పౌరులేనని ఎటువంటి సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. 

మోడీ ప్రభుత్వం కారణంగా ఢిల్లీ ఆందోళనల్లో 42మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. వారి ధాటికి మరో ఢిల్లీగా మారిపోయింది. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన వాళ్లంతా ఇండియన్లే. మళ్లీ సిటిజన్‌షిప్ కోసం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఓట్లు వేసి సీఎం, పీఎంలను ఎన్నుకుంటే ఇప్పడు మీకు పౌరసత్వం లేదని అంటున్నారు. అలాంటి వాళ్లను నమ్మకండి’ అని బహిరంగ సభలో మాట్లాడిన మమతా అన్నారు. 

ఒక్క సింగిల్ పర్సన్‌ను కూడా బెంగాల్ నుంచి బయటకు పంపేందుకు తాను సిద్ధంగా లేనని అన్నారు. సిటిజన్‌షిప్ కారణంగా ఏ ఒక్కరినీ బయటకు పంపమని సీఎం అన్నారు. కేంద్రానికి వార్నింగ్ ఇస్తూ.. ‘ఇది బెంగాల్ అని మర్చిపోకండి. ఢిల్లీలో జరిగింది ఇక్కడ అనుమతించం. బెంగాల్‌ను మరో ఢిల్లీ లేదా మరో ఉత్తర్‌ప్రదేశ్‌లా మార్చాలనుకోవడం లేదు. 

బీజేపీ తరచూ మమతా బెనర్జీని ముస్లింలకు ఫేవర్‌గా వ్యవహరిస్తుందని విమర్శిస్తూనే ఉంది. మైనారిటీ కమ్యూనిటీలకు సానుభూతి చూపించి ఓటు బ్యాంకు దండుకోవాలని చూస్తుందని ఆరోపించింది. 

See Also | కరోనా వైరస్ సోకిందని..భార్యను ఏం చేశాడో తెలుసా?