మాకు మేమే ప్రత్యామ్నాయం..మమత

మాకు మేమే ప్రత్యామ్నాయం..మమత

Updated On : February 4, 2021 / 7:31 PM IST

TMC వెస్ట్ బెంగాల్ లో తమకు తామే ప్రత్యామ్నాయమని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)కి టీఎంసీనే ప్రత్యామ్నాయం తప్ప.. మరెవరూ కాదని మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీపై తన మాటల దాడిని పెంచారు. గురువారం కోల్‌కతాలో గురువారం జరిగిన ఓ సమావేశంలో బీజేపీపై,మోడీ సర్కార్ పై ఆమె తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

లాక్‌డౌన్ సమయంలో వందల కిలోమీటర్ల దూరం నడుస్తూ అనేక మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోతున్న రైళ్లు నడపని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు దొంగల్ని ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తీసుకువెళ్లడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని మమతా బెనర్జీ మండిపడ్డారు. టీఎంసీ నుంచి బీజేపీలో భారీగా వలసల నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా చాలా ఆస్తులు సంపాదించిన వారు వాటితోపాటు తమను కాపాడుకునేందుకే బీజేపీలోకి వెళ్తున్నారని ఆరోపించారు.

టీఎంసీ నుంచి కొంతమంది దేశద్రోహులను ఆకట్టుకుని బెంగాల్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఒక ఫార్ములాను ఉపయోగిస్తున్నదని విమర్శించారు. బీజేపీ వారు అల్లర్లు చేసేవారన్న సంగతి ఆ పార్టీలోకి వెళ్లేవారు గుర్తుంచుకోవాలని మమత అన్నారు. బీజేపీ అల్లర్లు కోరుకుంటుందని, తాము శాంతిని కోరుకుంటామని చెప్పారు. అందుకే తమ నినాదం.. వద్దు వద్దు బీజేపీ వద్దు. వద్దు వద్దు మోసగాళ్లు వద్దు. వద్దు వద్దు దోపిడీదారులు వద్దు. వద్దు వద్దు అవినీతిపరులు వద్దు అని మమత అన్నారు.