Shivanshi Verma viral post : ఈమె చాలా వెరైటీ.. శాలరీ పెంచొద్దని వేడుకుంది.. ఎందుకో తెలుసా!

బాస్ జీతం పెంచుతానంటే ఉద్యోగులు ఎగిరి గంతేస్తారు. కానీ ఓ ఉద్యోగిని వద్దని రిజెక్ట్ చేసింది. అదేంటి? అని ఆశ్చర్యపోతున్నారా.. ఎందుకో చదవండి.

Shivanshi Verma viral post : ఈమె చాలా వెరైటీ.. శాలరీ పెంచొద్దని వేడుకుంది.. ఎందుకో తెలుసా!

Shivanshi Verma viral post

Updated On : July 7, 2023 / 1:24 PM IST

Shivanshi Verma viral post : ఏ కంపెనీలో అయినా ఉద్యోగులు జీతాలు ఎప్పుడు పెంచుతారా? అని ఎదురుచూస్తారు. కానీ ఓ ఉద్యోగిని జీతం పెంచుతామంటే వద్దని తిరస్కరించింది? ఆశ్చర్యంగా ఉంది కదా.. హెల్త్ అండ్ వెల్ నెస్ ప్లాట్‌ఫారమ్ ‘హెల్త్ టిక్’ ఫౌండర్ శివాంషి వర్మ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. జీతం పెంచుతామంటే తిరస్కరించిన ఉద్యోగిని అద్భుతమైన కథనాన్ని ఆమె షేర్ చేసుకున్నారు.

China : రోజూ 6 గంటలు టాయిలెట్‌లో గడిపిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన కంపెనీ..

శివాంషి వర్మ దీక్ష అనే ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌ని తమ సంస్థలో ఉద్యోగానికి తీసుకున్నారట. కొన్ని వారాలు గమనించిన తరువాత ఆమె తన రోల్ సరిగా చేయలేకపోతోందని భావించి ఉద్యోగం నుంచి తొలగించాలని భావించారట. అయితే దీక్ష తను చేస్తున్న పోస్ట్ కాకుండా వేరే స్ధానంలో తనకు అవకాశం ఇవ్వమని కోరిందట. సరే అని ఆమె పొజిషన్ మార్చారట. అంతే ఆమె అద్భుతమైన పనితనంతో అందరినీ ఆకట్టుకోవడం ఆశ్చర్యమనిపించిందట. దీక్షను ఉద్యోగం నుంచి తీసేయాలనుకున్న తమ ఆలోచనను శివాంషి వర్మ తన కో-ఫౌండర్ విరమించుకున్నారట. రెండు నెలల తర్వాత ఆమె పనీ తీరు నచ్చి జీతం పెంచాలని అనుకున్నారట. అందుకు దీక్ష సున్నితంగా తిరస్కరించిందట. తన పొజిషన్ మాత్రమే పెంచమని ఆ తర్వాతే తన జీతం సంగతని తన అభిప్రాయం వ్యక్తం చేసిందట. దీక్ష నిర్ణయాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఈ అంశాలన్ని శివాంషి వర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో (@shivanshi_v) షేర్ చేసుకున్నారు.

Starbucks : స్టార్‌బక్స్‌కు భారీ దెబ్బ.. ఉద్యోగినికి రూ.210కోట్లు చెల్లించాలని ఆదేశం

‘చాలామంది దీక్ష తెలివైనది కాదని.. కొందరు మంచిదని అనుకోవచ్చు. అనేకమందిని ఇంటర్వ్యూలు చేయడం ద్వారా అందరూ డబ్బునే ఆశిస్తారని తెలుసుకున్నాను. కానీ దీక్షలో చిత్తశుద్ధి ఉన్న వ్యక్తిని చూశాను. ఆమెను కంపెనీ గురించి బాగా ఆలోచించే వ్యక్తిగా చూస్తున్నాను’ అంటూ శివాంషి వర్మ తన పోస్ట్‌లో షేర్ చేసుకున్నారు. శివాంషి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నిజంగా కొందరు తమకు వచ్చే జీతం కన్నా.. ఉద్యోగంలో తమ స్ధాయికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా జీతం అదే పెరుగుతుందన్న నమ్మకంతో పనిచేస్తారు. దీక్ష లాంటి ఉద్యోగులకు నిజంగానే కంపెనీలు పెద్ద పీట వేస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. శివాంషి పోస్ట్ చదివితే అదే అర్ధం అవుతుంది.