Ayodhya Ram Mandir: ‘అయోధ్య రామ మందిర ప్రసాదం’ అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు కేంద్రం నోటీసులు జారీ

అమెజాన్ ప్రకటనలు కస్టమర్లను తప్పుదారి పట్టించాయని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంటూ అమెజాన్‍‌కు..

Ayodhya Ram Mandir: ‘అయోధ్య రామ మందిర ప్రసాదం’ అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు కేంద్రం నోటీసులు జారీ

Ayodhya Ram Mandir

‘అయోధ్య రామ మందిర ప్రసాదం’ అంటూ మిఠాయిల అమ్మకాలు చేపట్టింది అమెజాన్‌. దీంతో ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. స్వీట్ల అమ్మకాలకు సంబంధించి మోసపూరిత వ్యాపార విధానాలు చేపట్టిందని అమెజాన్‌కు ఈ నోటీసులు జారీ అయ్యాయి.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ఇంకా ప్రారంభించలేదన్న విషయం తెలిసిందే. అటువంటిది ఆ మందిర ప్రసాదం పేరిట స్వీట్లను విక్రయిస్తుండడం గమనార్హం. కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తోందని అమెజాన్‌పై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫిర్యాదు చేయడంతో కేంద్ర సర్కారు చర్యలు తీసుకుంటోంది.

అమెజాన్ ప్రకటనలు కస్టమర్లను తప్పుదారి పట్టించాయని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంటూ అమెజాన్‍‌కు నోటీసులు పంపింది. దీనిపై సమాధానం ఇచ్చేందుకు అమెజాన్‌కు 7 రోజుల గడువు ఇచ్చింది.

సమాధానం ఇవ్వకపోతే నిబంధనల ప్రకారం అమెజాన్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరుకానున్నారు.

Ayodhya Ram Mandir: స్కూల్లో ప్రార్థన వేళ.. భక్తిపారవశ్యంలో మునిగి విద్యార్థులు, టీచర్ డ్యాన్స్