Driver Stopped Ambulance for Liquor : మద్యం కోసం అంబులెన్సు ఆపేసిన డ్రైవర్..తనకో ‘పెగ్గు’ పేషెంటుకో ‘పెగ్గు’..ఆ పై రచ్చ రచ్చ

మద్యం కోసం నడిరోడ్డుమీద అంబులెన్సు ఆపేసాడు డ్రైవర్. మద్యం షాపు వద్ద బాటిల్ కొనుక్కుని..తనో ‘పెగ్గు’ వేసుకుని పేషెంటుకో ‘పెగ్గు’..ఇచ్చాడు. అదేమని ప్రశ్నించినవారిపై వాగ్వాదానికి దిగి రచ్చ రచ్చ చేశాడు.

Driver Stopped Ambulance for Liquor : మద్యం కోసం అంబులెన్సు ఆపేసిన డ్రైవర్..తనకో ‘పెగ్గు’ పేషెంటుకో ‘పెగ్గు’..ఆ పై రచ్చ రచ్చ

Driver Stopped Ambulance for Liquor Bottle

Updated On : December 21, 2022 / 12:18 PM IST

Driver Stopped Ambulance for Liquor Bottle :  పెరుగు ప్యాకెట్ కోసం ఓ లోకోపైలెట్ ఏకంగా రైలును మధ్యలో ఆపేసిన ఘటన గురించి విన్నాం. కచోరీ తినాలనిపించి రైలు ఆపేసిన లోకో పైలెట్ గురించి విన్నాం. కానీ ఒడిశాలో ఓ అంబులెన్స్ డ్రైవర్ మద్యం కోసం వాహనాన్ని నడిరోడ్డుమీద ఆపేసి మద్యం షాపుకెళ్లి బాటిల్ కొనుక్కున్నాడు. ఆ తరువాత తాపీగా అక్కడే కూర్చుని పెగ్ మీద పెగ్ లాగించాడు. అక్కడితో ఆగాడా అంటే అదీలేదు.. నడిరోడ్డుమీద అంబులెన్స్ ఆపేసి మద్యం తాగటమేకాకుండా ఏకంగా వాహనంలో ఉన్న ‘పేషెంట్ కు కూడా ఓ పెగ్గు’ పట్టించాడు. ఇదంతా అక్కడే ఉన్న కొంతమంది చూశారు. అదేమని ప్రశ్నించారు. అక్కడితో మొదలైంది రచ్చ రచ్చ..

Driver Stopped Train to Curd : ఆటో అనుకున్నాడేమో..పెరుగు కోసం రైలు ఆపేసిన డ్రైవర్..

జగత్సింగ్‌పూర్‌ జిల్లాలోని తిర్తోల్‌ రహదారిపై ఓ రోగిని తీసుకెళ్తున్న అంబులెన్సు రోడ్డు పక్కన ఆగింది. వాహనం దిగిన డ్రైవర్‌.. ఓ మద్యం బాటిల్‌ కొనుక్కుని ను తీసి గ్లాసులో పోసుకొని తాగటం మొద మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా వాహనంలో ఉన్న పేషెంటుకు ఓ పెగ్గు అందించాడు. కాలికి గాయమై, స్ట్రెచర్‌పై పడుకొని ఉన్న సదరు వ్యక్తి (రోగి) కూడా మద్యం తాగాడు. ఆ రోగి పక్కనే ఓ మహిళతో పాటు ఓ చిన్న పిల్లాడు కూడా ఉన్నారు. అంబులెన్స్ డ్రైవర్ వాహనాన్ని ఆపేసి మద్యం తాగటాన్ని చూసిన కొంతమంది వాహనదారులు..ప్రశ్నించారు. దీంతో అంబులెన్స్ డ్రైవర్ రెచ్చిపోయాడు. మీకెందుకు మీదారిన మీరెళ్లండీ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. కానీ కొంతమంది డ్రైవర్ ని మందలించారు. అలా వారితో అంబులెన్స్ డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు. పైగా పేషెంటే మద్యం అడిగాడని చెప్పుకొచ్చాడు.

Rajasthan : కచోరి తినాలనిపించి రైలు ఆపేసిన డ్రైవర్..తరువాత ఏమైందంటే..?!

ఈ తతంగాన్ని అక్కడే ఉన్న వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ విషయం బయటకొచ్చింది. ఈ వీడియో వైరల్ కావటంతో అదికాస్త జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ క్షేత్రబసి దాష్‌ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన మాట్లాడుతూ..అది ప్రైవేటు అంబులెన్సు అని.. అయినా ఆర్టీఓ, పోలీసు అధికారులు ఆ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవచ్చని అన్నారు. తమకు ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.