కరోనాను జయించిన అమిత్ షా, ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్

  • Published By: madhu ,Published On : August 31, 2020 / 10:54 AM IST
కరోనాను జయించిన అమిత్ షా, ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్

Updated On : August 31, 2020 / 11:29 AM IST

కేంద్ర హోం మంత్రి అమిత షా కరోనాను జయించారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఆయన్ను 2020, ఆగస్టు 31వ తేదీ సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన తెలిపారు. 2020, ఆగస్టు 02వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు.


https://10tv.in/chess-olympiad-india-and-russia-both-get-gold/

దీంతో ఆయన్ను గురుగ్రావ్ లోని వేదాంత ఆసుపత్రిలో చేరారు. తర్వాత..పూర్తిగా ఆరోగ్యంగా కోలుకోవడంతో ఇంటికి పంపించారు. ఆగస్టు 14వ తేదీన ఇంటికి వచ్చారు. కానీ..మరలా అనారోగ్యంగా ఉండడం, నీరసంగా ఉండడంతో ఆగస్టు 18వ తేదీన ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. నిపుణులైన డాక్టర్ల టీం ఆయన్ను పర్యవేక్షించింది. పూర్తిగా కోలుకోవడంతో సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు.