Chintan Shivir: 27న అమిత్ షా సమక్షంలో రాష్ట్ర హోంమంత్రుల సమావేశం.. హాజరు కానున్న ప్రధాని
చింతన్ శివిర్‌లో ఆరు సెషన్లలో వివిధ అంశాలపై చర్చిస్తారు. తొలిరోజు హోంగార్డులు, సివిల్ డిఫెన్స్, ఫైర్ ప్రొటెక్షన్, శత్రు ఆస్తులు తదితర అంశాలపై చర్చిస్తారు. మరుసటి రోజు సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్ ట్రాఫికింగ్, మహిళల భద్రత, సరిహద్దు నిర్వహణ వంటి అంశాలపై చర్చిస్తామని ప్రకటనలో పేర్కొంది. సరిహద్దుల రక్షణ, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి, భూ సరిహద్దు నిర్వహణ, తీర భద్రత అనే అంశాలపై చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల హోంమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు చింతన్ శివిర్ ఆహ్వానం ఇప్పటికే పంపినట్లు తెలుస్తోంది.

Amit Shah To Chair 'Chintan Shivir' Of State Home Ministers From Oct 27
Chintan Shivir: నేరాలను నిరోదించేందుకు వ్యవస్థలో ఐటీ వినియోగం పెరుగుదల, మహిళల భద్రత, తీర భద్రత, ఇతర అంతర్గత భద్రత వంటి సమస్యలపై రాష్ట్రాల హోం మంత్రులతో ఏర్పాటు చేయనున్న ‘చింతన్ శివిర్’లో చర్చించనున్నారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో అక్టోబర్ 27, 28న రెండు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన ‘విజన్ 2047’, ‘పంచప్రాణ్’ అమలుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడమే లక్ష్యంగా ‘చింతన్ శివిర్’ కార్యక్రమం ఏర్పాటు చేశారని కేంద్ర హోంశాఖ నుంచి వెలువడిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఈ చింతన్ శివిర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం పాల్గొననున్నారు. రెండవ రోజైన అక్టోబర్ 28న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
చింతన్ శివిర్‌లో ఆరు సెషన్లలో వివిధ అంశాలపై చర్చిస్తారు. తొలిరోజు హోంగార్డులు, సివిల్ డిఫెన్స్, ఫైర్ ప్రొటెక్షన్, శత్రు ఆస్తులు తదితర అంశాలపై చర్చిస్తారు. మరుసటి రోజు సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్ ట్రాఫికింగ్, మహిళల భద్రత, సరిహద్దు నిర్వహణ వంటి అంశాలపై చర్చిస్తామని ప్రకటనలో పేర్కొంది. సరిహద్దుల రక్షణ, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి, భూ సరిహద్దు నిర్వహణ, తీర భద్రత అనే అంశాలపై చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల హోంమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు చింతన్ శివిర్ ఆహ్వానం ఇప్పటికే పంపినట్లు తెలుస్తోంది.
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పీడీ యాక్ట్‌ను సమర్థించిన అడ్వైజరీ బోర్డ్