Makar Sankranti: సంక్రాంతి వేడుకలో పతంగి ఎగురవేస్తూ హుషారుగా కనిపించిన అమిత్ షా
ఈ పండుగను గుజరాత్ రాష్ట్రంలో ఉత్తరాయణం పేరుతో జరుపుకుంటారు. మకరలోకి సూర్యుడు ప్రభవించే మొదటి రోజుగా గుజరాతీలు ఈ పండుగ చేసుకుంటారు. అంతే కాకుండా ఈ రోజును అంతర్జాతీయ పతంగుల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఉదయమే పూజలు చేసి, వెంటనే ఇళ్లపైకి ఎక్కేస్తారు. అనంతరం పొద్దు పోయే వరకు పతంగులు ఎగురవేస్తూ ఉత్సాహంగా గడుపుతారు

Amit Shah tries hand at flying kite in Ahmedabad on Makar Sankranti
Makar Sankranti: మకర సంక్రాంతిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. స్వరాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న తన నివాసంలో శనివారం పంతుగులు ఎగురవేస్తూ హుషారుగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ముందు రోజు శ్రీ గజన్నాథ గుడిని అమిత్ షా దర్శించుకున్నారు. భారత క్యాలెండర్ ప్రకారం.. సంక్రాంతి చాలా ముఖ్యమైన పండుగల్లో ఒకటి.
#WATCH | Gujarat: Union Home Minister Amit Shah participated in the kite festival in Vejalpur, Ahmedabad today. pic.twitter.com/0YwR8sgT0r
— ANI (@ANI) January 14, 2023
ఈ పండుగను గుజరాత్ రాష్ట్రంలో ఉత్తరాయణం పేరుతో జరుపుకుంటారు. మకరలోకి సూర్యుడు ప్రభవించే మొదటి రోజుగా గుజరాతీలు ఈ పండుగ చేసుకుంటారు. అంతే కాకుండా ఈ రోజును అంతర్జాతీయ పతంగుల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఉదయమే పూజలు చేసి, వెంటనే ఇళ్లపైకి ఎక్కేస్తారు. అనంతరం పొద్దు పోయే వరకు పతంగులు ఎగురవేస్తూ ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజుతోనే గుజరాత్లో పతంగుల పండుగ ప్రారంభం అవుతుంది. ఈ పండుగ రోజున నువ్వులు, వేరుశెనగతో చేసిన చిక్కీ అలాగే శీతాకాలపు కూరగాయలతో చేసిన ఉండీ వంటి రుచికరమైన వంటకాలను గుజరాతీలు చేసుకుని ఇష్టంగా తింటారు.