మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవ్ రావు హతం.. ప్రకటించిన అమిత్‌ షా.. 54 మంది నక్సలైట్లు అరెస్ట్.. అంతేకాదు..

నక్సలిజంపై భారత్ చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారని తెలిపారు.

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవ్ రావు హతం.. ప్రకటించిన అమిత్‌ షా.. 54 మంది నక్సలైట్లు అరెస్ట్.. అంతేకాదు..

Amit Shah

Updated On : May 21, 2025 / 4:30 PM IST

నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయిలాంటి విజయాన్ని సాధించామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయంటూ ట్వీట్ చేశారు.

Also Read: రాష్ట్రంలో సర్కారును కూల్చే కుట్ర.. ఆ రెండు పార్టీలు కలిశాయి: మల్లు రవి

వీరిలో సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నారని అమిత్‌ షా నిర్ధారించారు. నక్సలిజంపై భారత్ చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారని తెలిపారు.

ఈ విజయం సాధించిన భద్రతా దళాలు, ఏజెన్సీలను అభినందిస్తున్నానని అమిత్‌ షా చెప్పారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ మహారాష్ట్ర నుంచి 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశామని, 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని తెలిపారు. 2026 మార్చి 31లోగా నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించిందని ఆయన గుర్తుచేశారు.