రాష్ట్రంలో సర్కారును కూల్చే కుట్ర.. ఆ రెండు పార్టీలు కలిశాయి: మల్లు రవి

తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని మళ్లీ రానివ్వకూడదని అనుకుంటున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో సర్కారును కూల్చే కుట్ర.. ఆ రెండు పార్టీలు కలిశాయి: మల్లు రవి

Updated On : May 21, 2025 / 3:58 PM IST

కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సర్కారును కూల్చే కుట్రలు చేస్తున్నారని, బీజేపీతో కలిసి బీఆర్ఎస్‌ పార్టీ తెలంగాణ సర్కారును ఇబ్బందులు పెట్టేందుకు యత్నిస్తోందని తెలిపారు.

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని మల్లు రవి అన్నారు. ఆ మూడు పార్టీలు కలిసి తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని మళ్లీ రానివ్వకూడదని అనుకుంటున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు, కాంగ్రెస్ సర్కారుకు సంబంధం లేదని చెప్పారు.

Also Read: మావోయిస్టు అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు హతం.. ఎవరీయన?

కేసీఆర్ ఏమన్న చట్టానికి అతీతుడా అని మల్లు రవి ప్రశ్నించారు. గతంలో చాలా మంది మాజీ సీఎంలు జైలుకి వెళ్లారని అన్నారు. బిహార్‌లో లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా అని నిలదీశారు.

నోటీసులకు స్పందించి కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని అన్నారు. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారని ఆరోపించారు. ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్‌ జరుపుతున్న విచారణకు సహకరించాలని మల్లు రవి డిమాండ్ చేశారు.