బీసీసీఐ సెక్రటరీగా అమిత్ షా కొడుకు

బీజేపీ చీఫ్,కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ సెక్రటరీ పదవికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక,కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ దుమాల్ బీసీసీఐ ట్రెజరర్ గా ఎంపిక అయినట్లు బీసీసీఐ ఉన్నత వర్గాలు తెలిపాయి. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంపిక దాదాపు ఖాయమైనట్లే అని తెలుస్తోంది.
ప్రస్తుతం సీకే ఖన్నా బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ చైర్మన్ గా బ్రిజేష్ పటేల్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసిందే. అక్టోబర్ 23,2019న జరగాల్సిన బీసీసీఐ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు అక్టోబర్-14,2019 చివరి తేదీ.