Boy Fell Into Borewell : బోరుబావిలో పడిన 8 ఏళ్ల బాలుడు

మధ్యప్రదేశ్ లో 8 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.

Boy Fell Into Borewell : బోరుబావిలో పడిన 8 ఏళ్ల బాలుడు

BOY BOREWELL

Updated On : December 7, 2022 / 8:33 AM IST

Boy Fell Into Borewell : మధ్యప్రదేశ్ లో 8 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. బేతుల్ జిల్లా మాండవీలో నానక్ చౌహాన్ అనే రైతు రెండేళ్ల క్రితం తన పొలంలో బోర్ వేశారు.

అందులో నీళ్లు అడుగంటిపోవడంతో అది నిరుపయోగంగా ఉంది. బోరుబావిని కప్పి ఉంచానని, అందులో ఎలా పడిపోయాడో తెలియడం లేదని పోలీసులకు చెప్పాడు. అయితే బాలుడు బోరుబావిలో ఎంత లోతులో ఉన్నాడన్న విషయం ఇంకా తెలియలేదని అధికారులు పేర్కొన్నారు.

borewell: బోరుబావిలో ప‌డి 60 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన బాలిక.. 5 గంటల్లో బ‌య‌ట‌కు తీసిన జ‌వాన్లు

బాలుడికి ఆక్సిజన్ అందేలా ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా బోరుబావికి సమాంతరంగా గొయ్యి తీసి బాలుడిని బయటకు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.