IPS officer Arun Bothra : ఆన్సర్ షీట్స్ లోపల కరెన్సీ నోట్లు.. పరీక్షలో పాస్ చేయమని లంచం ఇవ్వజూపిన విద్యార్ధులు
పరీక్షలో పాస్ చేయమంటూ కొందరు విద్యార్ధులు పేపర్లు దిద్దే ఉపాధ్యాయుడికి లంచం ఇవ్వజూపారు. సమాధాన పత్రాల్లో కరెన్సీ నోట్లను ఉంచారు. ఓ ఉపాధ్యాయుడు తనకు షేర్ చేసిన ఫోటోను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్విట్టర్‌లో షేర్ చేసారు.

IPS officer Arun Bothra
IPS officer Arun Bothra : పరీక్షలో పాస్ చేసేందుకు ఎవాల్యుయేటర్లకు లంచం ఇవ్వడానికి కొందరు విద్యార్ధులు ప్రయత్నించారు. ఈ విషయాన్ని స్పష్టం చేసే ఓ ఫోటోను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా షేర్ చేయడం అందర్నీ షాక్‌కి గురి చేసింది.
Bihar : రూ.2లంచం తీసుకున్న ఐదుగురు పోలీసులు,37 ఏళ్లు విచారణ, కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే..?
ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా ట్విట్టర్‌లో (@arunbothra) ఓ ఫోటో షేర్ చేశారు. అది వైరల్‌గా మారింది. బోర్డు పరీక్షకు హాజరైన విద్యార్ధులు ఆన్సర్ షీట్స్ లోపల ఉంచిన రూ.100, రూ.200, రూ.500 నోట్లు అవి. తాము పరీక్షలో పాస్ కావాలనే అభ్యర్ధనతో ఈ నోట్లను ఉంచారట. పరీక్షలో పాస్ అవ్వడానికి ఎవాల్యుయేటర్లకు విద్యార్ధులు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన వాస్తవాన్ని ఈ పోస్ట్ వెలుగులోకి తెచ్చింది.
ఓ ఉపాధ్యాయుడు ఆన్సర్ షీట్స్‌లో కరెన్సీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన అరుణ్ బోత్రాతో ఈ ఫోటోను షేర్ చేసుకున్నారు. బోత్రా ‘ఒక ఉపాధ్యాయుడు పంపిన ఫోటో. ఈ కరెన్సీ నోట్లను విద్యార్ధులు తమకు పాస్ మార్కులు ఇవ్వాలనే రిక్వెస్ట్‌తో బోర్డు పరీక్ష యొక్క సమాధాన పత్రాల్లో ఉంచారు. ఈ ఇన్సిడెంట్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు మొత్తం విద్యా వ్యవస్థ గురించి చెబుతోంది’ అనే శీర్షికతో పోస్ట్ చేశారు.
Madhya Pradesh : లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారి…లంచం డబ్బు నమిలి మింగేశాడు
నెటిజన్స్‌తో పాటు కొంతమంది ఉపాధ్యాయులు సైతం ఈ పోస్ట్‌పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘నేను పేపర్ దిద్దే సమయంలో కూడా నాకు ఇలా మూడుసార్లు రిక్వెస్ట్‌లు వచ్చాయి. డబ్బు.. లేదంటే పరీక్షలో ఇచ్చే ప్రశ్నలకు సమాధానంగా తమ ఎమోషనల్ స్టోరీని రాస్తారు. అలాంటి స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అంటూ ఒక ఉపాధ్యాయుడు చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Pic sent by a teacher. These notes were kept inside answer sheets of a board exam by students with request to give them passing marks.
Tells a lot about our students, teachers and the entire educational system. pic.twitter.com/eV76KMAI4a
— Arun Bothra ?? (@arunbothra) August 21, 2023