Anand Mahindra : 7 సంవత్సరాల క్రితం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలో చిన్నారి.. ఇప్పుడు డైరెక్ట్‌గా ఆయనను కలిసింది

ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనాలకు రెగ్యులర్ గా టచ్‌లో ఉంటూ ఉపయోగకరమైన పోస్టులు షేర్ చేస్తుంటారు. 7 సంవత్సరాల క్రితం ఆయన ట్వీట్ చేసిన ఓ చిన్నారి ఫోటో గురించి గుర్తు చేస్తూ.. ఆ చిన్నారి డైరెక్ట్‌గా ఆయనను కలుసుకుంది. ఆ విషయాన్ని ఆయన సంతోషంగా షేర్ చేసుకున్నారు.

Anand Mahindra : 7 సంవత్సరాల క్రితం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలో చిన్నారి.. ఇప్పుడు డైరెక్ట్‌గా ఆయనను కలిసింది

Anand Mahindra

Updated On : June 13, 2023 / 1:45 PM IST

Anand Mahindra : టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా తనకు నచ్చిన అంశాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. 7 సంవత్సరాల క్రితం కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఏడాది వయసున్న చిన్నారి ఫోటోను ఆయన షేర్ చేశారు. తాజాగా ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఆనంద్ మహీంద్రాను నేరుగా కలవడంతో ఈ విషయాన్ని సంతోషంగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

Anand Mahindra : పల్లెటూర్లలో ప్రాణదాత ఈ వాహనం.. అంటూ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్

మహీంద్రా అండ్ మహీంద్రా చైర్ పర్సన్ ఆనంద్ మహీంద్రకి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ఎప్పుడూ ఆయన జనాలతో టచ్‌లో ఉంటారు. ఏడేళ్ల క్రితం ఓ చిన్నారి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఫోటోను ఆనంద్ మహీంద్ర షేర్ చేస్తూ తమ ఆటో ఆర్కైవ్‌లో భద్రపరుస్తామంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్న చిన్నారి రియా డైరెక్ట్‌గా ఆనంద్ మహీంద్రాను వచ్చి కలుసుకుంది. ఆమెకి ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు పంచుకున్న ట్వీట్‌ను ఆయనకు గుర్తు చేసింది.

Anand Mahindra : నా ఇద్దరి మనవల భద్రత నాకు ముఖ్యం.. అంటూ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్

‘చిన్నారి రియా తనకు ఏడాది వయసున్నప్పుడు ఆమె ఫోటోను ట్వీట్ చేశానని నాకు గుర్తు చేసింది. ఆ ట్వీట్‌ను షేర్ చేసిన గౌరీష్‌కి (Gaurish Lad) ధన్యవాదాలు’ అనే శీర్షికతో ఆయన రాసుకొచ్చిన ట్వీట్ వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో గతంలో తను రియా కోసం పోస్ట్ చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్‌తో పాటు.. తాజాగా రియాతో తాను దిగిన ఫోటోను ఆనంద్ మహీంద్ర షేర్ చేసుకున్నారు. ‘మీ కలయిక అందమైన క్షణం’ అని ఒకరు..’మాకు మిమ్మల్ని కలిసే అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నాం’ అంటూ మరొకరు కామెంట్లు చేశారు.