Anand Mahindra : ప్రజ్ఞానంద పేరెంట్స్‌కి ఆనంద్ మహీంద్రా ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?

ఆనంద్ మహీంద్రా ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద పేరెంట్స్‌కి మహీంద్రా థార్ బహుమతిగా ఇచ్చారు. ఎల్లవేళలా ప్రజ్ఞానందకు మద్దతుగా నిలబడి తనని సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు అభినందనలు అంటూ ఆయన షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Anand Mahindra : ప్రజ్ఞానంద పేరెంట్స్‌కి ఆనంద్ మహీంద్రా ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?

Anand Mahindra

Anand Mahindra : టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద పేరెంట్స్‌కి మహాంద్రా థార్ బహుమతిగా ఇచ్చారు. ప్రజ్ఞానందను సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు ఈ బహుమతి ఇస్తున్నానంటూ ఆయన షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Anand Mahindra : నాకు ఆ హోటల్ సూట్‌లో నిద్ర రాదు.. అంటూ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్

ఆనంద్ మహీంద్రా ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారు బహుమతిగా ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో కొద్దిరోజుల క్రితం చాలామంది ప్రజ్ఞానందకు కారు బహుమతిగా ఇవ్వమని ఆనంద్ మహీంద్రాను కోరారు. ఆయనను కోరిన వారిలో క్రిష్లే అనే ఒక వ్యక్తి చేసిన ట్వీట్‌కి సమాధానం ఇస్తూ ట్విట్టర్‌లో ఇలా షేర్ చేసుకున్నారు. ‘ మీ సెంటిమెంట్‌ను అభినందిస్తున్నాము, క్రిష్లే మరియు మీలాంటి చాలా మంది ప్రజ్ఞానందకు థార్ బహుమతిగా ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. కానీ నాకు మరో ఆలోచన ఉంది …తల్లిదండ్రులు తమ పిల్లలకు చెస్‌ను పరిచయం చేయమని .. వారికి మద్దతు ఇస్తూ సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మేము ప్రజ్ఞానానంద తల్లిదండ్రులకు XUV4OO EVని బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నాను. శ్రీమతి నాగలక్ష్మి & శ్రీ రమేష్‌బాబు, తమ కుమారుడి అభిరుచిని పెంచి పోషించినందుకు అతనికి తమ అలుపెరుగని మద్దతునిచ్చినందుకు మా కృతజ్ఞతలు. మీరు ఏమనుకుంటున్నారు?’ అంటూ ఆనంద్ మహీంద్రా ..మహీంద్రా & మహీంద్రాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , CEO అయిన రాజేష్ జెజురికర్‌ను కూడా ట్యాగ్ చేసి దానిపై తన ఆలోచనలను పంచుకోమని కోరారు.

Anand Mahindra : ‘ఆయన గురించి తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నా’.. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ అవుతోంది. ‘ప్రజ్ఞానానందను ప్రోత్సహించిన తల్లిదండ్రులను మెచ్చుకోవాలనే ఆలోచన బాగుంది’ అని.. ‘మంచి ఆలోచన సార్.. చెస్‌ను ప్రోత్సహించడం.. వారి పిల్లల అభిరుచిని పెంచే తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడం నిజంగా అభినందనీయం’ అంటూ ఆనంద్ మహీంద్రాకు నెటిజన్లు రిప్లై చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.