Anand Mahindra : వర్షం ఎంజాయ్ చేస్తున్న బుడ్డోడు.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్
తొలకరి వర్షంలో తడవడానికి పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. రీసెంట్గా వర్షంలో తడుస్తున్న ఓ చిన్నారి వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న చిన్నారి క్యూట్ వీడియో అందర్నీ ఆకట్టుకుంది.

Anand Mahindra
Anand Mahindra : ఈసారి వర్షాలు చాలా ఆలస్యం అయ్యాయి. వర్షాల కోసం జనం చాలా ఆత్రంగా ఎదురుచూసారు. మొత్తం మీద వర్షాలు మొదలయ్యాయి. సీజన్ మొదట్లో కురిసే వర్షాల్లో తడవడం అందరికీ ఇష్టమే. ఇక పిల్లలైతే వర్షంలో తడవడానికి ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నా ఓ చిన్నారి వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.
Anand Mahindra : సునీతా విలియమ్స్‌ని లిఫ్ట్ అడిగిన ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీలు
మహారాష్ట్రని వర్షం పలకరించింది. ముంబయి వాసులు వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వారిలో ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు అని చెప్పాలి. లేటెస్ట్గా ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా (@anandmahindra) తన ట్విట్టర్ ఖాతాలో ఓ చిన్నారి వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ‘ఎట్టకేలకు ముంబయిలో ఇంటికి చేరగానే రుతుపవనాలు పలకరించాయి. ప్రతి భారతీయుడి మనసులో అంతర్గతంగా చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. మొదటి జల్లులో కురిసి ఆ ఆనందాన్ని పొందాలని’ అనే శీర్షికతో వీడియోని పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రా ఇటీవలే US నుంచి వచ్చారు. బిలియనీర్, ముఖేష్ అంబానీ, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరియు బృందా కపూర్లతో ఆయన తీసుకున్న సెల్ఫీ కూడా రీసెంట్గా వైరల్ అయ్యింది.
ఇక ముంబయిలో వర్షాలు కురవడంతోనే వాటి తీవ్రతను చూపిస్తున్నాయి. జూన్ 27,28 తేదీలలో IMD ముంబయిలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పాల్ఘర్, థానే, ముంబయి, రాయ్ గఢ్, రత్నగిరి జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
That just about sums up how it feels to come home to Mumbai to see that the monsoon has finally arrived… (the inner child in every Indian will never tire of finding joy in the first showers…)
pic.twitter.com/0TaBHfAy3v— anand mahindra (@anandmahindra) June 27, 2023