Anand Mahindra : ‘కలవంతిన్ దుర్గ్’ ట్రెక్కింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూడండి
పశ్చిమ కనుమల్లో అత్యంత భయంకరమైనవిగా పరిగణించే 'కలవంతిన్ దుర్గ్' గురించి ఎప్పుడైనా విన్నారా? చూడటానికే భయాన్ని కలిగిస్తున్న ఈ ప్రదేశంలో చాలామంది ట్రెక్కింగ్ చేస్తున్నారు. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Anand Mahindra
Anand Mahindra : వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆసక్తికరమైన వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన మహారాష్ట్రలోని ‘కలవంతిన్ దుర్గ్’ పై ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకుల ఆసక్తికరమైన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే ఈ స్పాట్ తనకు తెలియదని.. అయితే 60 డిగ్రీల వంపు ఉన్న ఈ కొండలపై తను ట్రెక్కింగ్ చేయగలనో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు.
Anand Mahindra : నా భార్య కోసం అలా పోజిచ్చా .. ఆగ్రాలో తన హనీమూన్‌లో ఫొటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ఆనంద్ మహీంద్రా తాజాగా ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో నెటిజన్లను సైతం ఆకట్టుకుంది. అంతే కాదు కాస్త భయం కూడా కలిగించింది. ఆనంద్ మహీంద్రా మహారాష్ట్రలోని కలవంతిన్ దుర్గ్‌కి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో (@anandmahindra) షేర్ చేశారు. తన ట్వీట్‌లో ‘ఈ ప్రదేశం గురించి తనకు పూర్తిగా తెలియదని.. అక్కడ ట్రెక్కింగ్ చేయగలనో లేదో తెలుసుకోవాలని.. కలవంతిన్ దుర్గ్‌పైకి వెళ్లడం పశ్చిమ కనుమలలో అత్యంత భయంకరమైన వాటిలో ఒకటిగా పరిగణిస్తారని.. దాదాపుగా 60 డిగ్రీల వంపులో ఉంటాయని’ ఆయన షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు స్పందించారు.
‘వీడియోలో ఇంక్లైన్ చాలా నిటారుగా ఉందని..అక్కడ తడి మరియు జారే పరిస్థితుల కారణంగా ప్రజలు సరైన బూట్లు ధరించాలని’ ఒక నెటిజన్ సూచించారు. ‘ఈ వీడియో నాకు ఆందోళన కలిగించిందని’ మరొకరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
I confess I had no clue about this spot. Have to figure out whether I’m up to this challenge! The trek to the top of the Kalavantin Durg is considered one of the most daunting in the Western Ghats. A roughly 60-degree incline. pic.twitter.com/mbgJ498ECy
— anand mahindra (@anandmahindra) July 22, 2023