హడలెత్తిస్తున్నాయ్ : ఢిల్లీలో 3 రోజుల్లో మూడు అగ్నిప్రమాదాలు

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 05:17 AM IST
హడలెత్తిస్తున్నాయ్ : ఢిల్లీలో 3 రోజుల్లో మూడు అగ్నిప్రమాదాలు

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వరుస అగ్నిప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లో మూడు అగ్నిప్రమాదాలు జరగటంతో ఢిల్లీ వాసులు హడలిపోతున్నారు. ఈ క్రమంలో నారాయణ ప్రాంతంలోని పేపర్ కార్డ్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 20 ఫైర్ ఇంజన్లతో సంఘటానాస్థలికి చేరుకుని  మంటలు ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత రెండు రోజుల వ్యవథిలోనే కరోల్ బాగ్ లోను..అర్పిత హోటల్ లో అగ్నిప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో కేవలం మూడు రోజుల వ్యవధిలో మూడు అగ్రిప్రమాదాలు జరిగాయి. ఎటువంటి ఫైర్ సేఫ్టీ పాటించకుండా భవన నిర్మాణాలు నిర్మింటచం..పర్మిషన్ ఇచ్చే క్రమంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి వెరసి అగ్నిప్రమాదాల సమయమంలో  వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. జనవావాసాలకు అతి సమీపంలో సంభవించిన ఈ అగ్నిప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాగా.. షార్ట్ సర్య్యూట్ వల్ల ఈ ఘటన జరిగిందని భావిస్తున్న క్రమంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు.