Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం, అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ.. ఏం జరుగుతోంది?
తెలంగాణకు సంబంధించి కీలక వ్యవహారాలు తెరమీదకు రానున్నాయని దర్యాప్తు సంస్థల వర్గాల వెల్లడించాయి. Delhi Liquor Case

Delhi Liquor Case - Magunta Sreenivasulu Reddy
Delhi Liquor Case – Magunta Sreenivasulu Reddy : దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం నమోదైంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అప్రూవర్ గా మారారు. అనంతరం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట రేట్ కు(ఈడీ) కేసుకు సంబంధించిన కీలక సమాచారం అందించారు. లిక్కర్ కేసులో సౌత్ గ్రూపు నుండి ఎక్కువ మంది అప్రూవర్స్ గా మారిన వైనం ఆసక్తి రేపుతోంది.
లిక్కర్ కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారారు శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి. రాఘవ రెడ్డి తో పాటు ఇప్పటికే అప్రూవర్ గా మారారు శరత్ చంద్రారెడ్డి. రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా అనేక మందిని ఈడీ ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ నుండి ఢిల్లీకి నగదు బదిలీలపై ప్రధానంగా ఈడీ ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం దర్యాప్తు స్తబ్దుగా ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నా అంతర్గతంగా జరగాల్సింది జరుగుతోందని ఈడీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ టార్గెట్ గా దూకుడు పెరుగుతుందని, తెలంగాణకు సంబంధించి కీలక వ్యవహారాలు తెరమీదకు రానున్నాయని దర్యాప్తు సంస్థల వర్గాల వెల్లడించాయి. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో అక్రమ నగదు బదిలీల వ్యవహారాలపై ఈడీ దృష్టి పెట్టింది.
కొన్ని రోజులుగా హవాలా వ్యవహారాలు నడిపే 20మందికిపైగా కీలక వ్యక్తులను ఈడీ అధికారులు ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబును ఇటీవల మరోమారు ప్రశ్నించింది ఈడీ. రానున్న రోజుల్లో మరికొంతమందిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.