తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Published By: vamsi ,Published On : April 16, 2019 / 06:13 AM IST
తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

Updated On : April 16, 2019 / 6:13 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణాదిలోని అన్నీ పార్టీలకు మద్దతుగా రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కర్నాటకలోని జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.. ఇవాళ(ఏప్రిల్ 16) తమిళనాడులోని డీఎంకేకు మద్దుతగా ప్రచారం చేస్తున్నారు. ఏపీలో పోలింగ్‌లో ముగియడంతో ఈవీఎంల పనితీరుపై విపక్షాలతో కలిసి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నచంద్రబాబు.. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. చంద్రబాబు వెంట ఎంపీ సీఎం రమేశ్ కూడా చెన్నైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రచారం అనంతరం మధ్యాహ్నం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కలిసి మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతారు. ఈవీఎంలపై పోరాటంలో తమతో కలిసి రావాలని స్టాలిన్‌ను కోరిన చంద్రబాబు.. దేశవ్యాప్తంగా పార్టీల మద్దతు కూడగట్టనున్నట్లు చెప్పారు.