బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు..

కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. ఈడీ, సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, డిపి సింగ్ వాదనలు వినిపించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు..

Updated On : August 27, 2024 / 1:00 PM IST

Kavitha bail plea: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. ఈడీ, సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, డిపి సింగ్ వాదనలు వినిపించారు. కవిత బెయిల్ పిటిషన్‌ను ఈడీ, సీబీఐ వ్యతిరేకించాయి. దర్యాప్తునకు కవిత సహరించడం లేదని, ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయా అని సుప్రీంకోర్టు ధర్మాసనంగా ప్రశ్నించగా.. నిందితులతో కవిత జరిపిన చాటింగ్ వివరాలున్నాయని ఈడీ సమాధానం ఇచ్చింది. వ్యక్తిగత హోదా అనేది బెయిల్ ఇవ్వడానికి ఆధారం కాదని ఈడీ వాదించింది.

కవితకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ముకుల్ రోహత్గి అభ్యర్థించారు. విచారణకు ఆమె సహకరించారని, ఫోన్లు కూడా ఈడీకి స్వాధీనం చేశారని చెప్పారు. బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో 5 నెలలు, సీబీఐ కేసులో 4 నెలలుగా జైల్లో ఉన్నారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో రూ. 100 కోట్లు చేతులు మారాయన్నది ఆరోపణ మాత్రమేనని అన్నారు. సిసోడియాకు బెయిల్ ఇచ్చారు.. మహిళగా బెయిల్‌కు అర్హురాలని పేర్కొన్నారు.

Also Read: ఏపీలో వైసీపీతో, తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో స్నేహమే దెబ్బతీసిందా? నాగార్జునపై సీఎం రేవంత్‌కు కోపమెందుకు..!

కాగా, కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనల నేపధ్యంలో ఆమె సోదరుడు కేటీఆర్, భర్త అనిల్ కుమార్, హరీశ్ రావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వచ్చారు.